37.2 C
Hyderabad
April 26, 2024 20: 56 PM
Slider తెలంగాణ

మద్యం ఆదాయం పెంచుకోవడానికా తెలంగాణ తెచ్చింది?

Indira sobhan

రాష్ట్రంలో జరిగే నేరాలన్నింటికి కారణం మద్యం అనేది అందరికి తెలిసిన విషయమే అయినా ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని Tpcc అధికార ప్రతినిధి ఇందిర శోభన్ పొశాల అన్నారు. పైగా లెక్కలేనని బెల్టు షాపులు పెట్టారని ఆమె అన్నారు.

అయితే సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం తెలుసుకుందామని ఎన్ని బెల్టు షాపులు ఉన్నాయి అని ప్రశ్నవేస్తే బెల్టు షాపులు లేవని సమాధానం చెప్పారని ఇదేం సమాచారమని ఆమె ప్రశ్నించారు. అయితే చట్ట విరుద్ధంగా మద్యం అమ్ముతున్న కేసులు ఎన్ని నమోదయ్యాయని అడిగితే 22 జిల్లాలలో 17952 కేసులు నమోదయ్యాయని తెలుపుతున్నారని ఆమె అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పాటైన తర్వాత మద్యం ఆదాయం నాలుగు రెట్లు పెరిగిందని ఆమె తెలిపారు. మద్యం ఆదాయం పెంచుకోవడానికేనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆమె ప్రశ్నించారు. పంజాబ్ లాంటి రాష్ట్రాలలో లిక్కర్ ఆదాయం తగ్గుతుంటే తెలంగాణలో పెరుగుతున్నదని ఆమె తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో లో ఏ పాలసీ అయినా ఆలస్యం కావచ్చేమో కానీ లిక్కర్ పాలసీ మాత్రం ఒక రోజు కూడా అటు ఇటు కాలేదని, దీన్నిబట్టి ఈ రాష్ట్ర ప్రజల పైన ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందని ఇందిర శోభన్ అన్నారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తూ రాష్ట్రంలో నేర ప్రవృత్తి పెరిగేందుకు కారణం అవుతున్నారని ఆమె విమర్శించారు. రహదారులకు 500మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు నెలకొల్పాల్సి ఉండగా రహదారికి 100 మీటర్ల దూరంలోనే మద్యం దుకాణాలను నెలకొల్పేందుకు అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ భాద్యతా రాహిత్యానికి నిదర్శనమని ఆమె అన్నారు.

దిశ ఘటన జరిగాక అయిన ప్రభుత్వం మద్య నియంత్రణ కు చర్యలు తీసుకుంటుందని ఊహించాం కానీ సర్కారు ఆ దిశగా ఏమాత్రం కృషి చేయడం లేదని  ఆమె అన్నారు. అత్యాచారాలు నిత్యం జరుగుతుండటానికి గల ప్రధాన కారణమైన లిక్కర్ ను ప్రభుత్వం అదుపు చేయకపోవడం అన్యాయమని అన్నారు.

తక్షణమే ప్రభుత్వం మద్యం నియంత్రణకు దశల వారీగా చర్యలు తీసుకోవాలన్నారు. గుజరాత్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఉందని, మరి ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా మద్య నిషేధం  అమలు చేయవచ్చు కదా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నీరా పాలసి నడవాలన్నా బెల్టు షాపులు బందు కావాలని, అరోగ్య వంతమైన తెలంగాణ గా తీర్చి దిద్దలంటే మద్యాన్ని నియంత్రించ వలసిన బాధ్యత ప్రభుత్వనిదేనని ఇందిర అన్నారు. లేకపోతే మహిళా లోకాన్ని చైతన్య పరిచి మరో తెలంగాణ రోషమ్మగా ఉద్యమిస్తానని అన్నారు.

Related posts

మహానుభావులను గుర్తు చేసుకున్న సిక్కోలు వాసులు

Satyam NEWS

Как читать графики акций: Как читать графики криптовалют РУКОВОДСТВО 2021 ️ БЕСПЛАТНО Кофе с крипто

Bhavani

బిజెపి నేతను చెప్పుతో కొట్టిన ఎన్సీపీ కార్యకర్తలు

Satyam NEWS

Leave a Comment