27.7 C
Hyderabad
May 4, 2024 09: 13 AM
Slider వరంగల్

ఈ నెల 9 న కాళోజీ కళాక్షేత్రం ప్రారంభo

#Kaloji Kalakshetra

ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ఈ నెల 9న వరంగల్‌ నగరానికి రానున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలిపారు.ఈ మేరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో పురపాలక శాఖ ముఖ్య స్పెషల్‌ కార్యదర్శి అరవింద్‌కుమార్‌, మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, అరూరి రమేశ్‌, ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య, కుడా చైర్మన్‌ సుందర్‌రాజ్‌తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ వరంగల్‌ నగరంలో నిర్మించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కళాక్షేత్రాన్ని ఈ నెల 9న ఆయన జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు. ఇప్పటికే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ పాల్గొంటారని, కవులు, కళాకారులతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.నగరంలో మధ్య తరగతి వర్గాల కోసం కుడా ఆధ్వర్యంలో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తామని, కాస్ట్‌ టు కాస్ట్‌ పద్ధ్దతిలో మధ్య తరగతి వర్గాలు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కోనుగోలు చేసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.

వరంగల్‌లో కార్మికుల కోసం కార్మిక భవన్‌ నిర్మిస్తున్నామని, 6 మాడల్‌ లేబర్‌ అడ్డాలకు షెల్టర్లను నిర్మించనున్నామని, సమ్మయ్యనగర్‌ నాలా పక్కనున్న వరద భాదితులకు 9 అంతస్తులతో అపార్ట్‌మెంట్‌ నిర్మించి ఫ్లాట్లు అందజేస్తామని పేర్కొన్నారు. పెద్దమ్మగడ్డ రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి ఆ గృహ సముదాయంలో ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు.

చారిత్రక వరంగల్‌ నగరంపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టిసారిస్తున్నారని వినయ్‌ భాస్కర్‌ తెలిపారు. హైదరాబాద్‌ తర్వాత రెండో నగరంగా ఉన్న వరంగల్‌ అభివృద్ధి కోసం తొమ్మిదేండ్లలో రూ.4,500 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. నగరంలో రూ.3 కోట్లతో చేపట్టిన 19 జంక్షన్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, వరదల వల్ల జరిగిన నష్టానికి మంత్రి కేటీఆర్‌ రూ.250 కోట్లు మంజూరు చేశారని చీఫ్‌ విప్‌ తెలిపారు.

నగరానికి విచ్చేసిన ఎంఏయూడీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాళోజీ కళాక్షేత్రం పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత

Satyam NEWS

చైనా పీచమణిచే బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5 ప్రయోగం విజయవంతం

Satyam NEWS

ఏపీ లో రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలు నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment