రాష్ట్రంలో పరిపాలన భ్రష్టు పట్టిందని, పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలం అయిందని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే లింగారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వై ఎస్ ఆర్ సి పి అరాచకాలను కళ్ళారా చూస్తున్నా ఎన్నికల సంఘం చర్యలు శూన్యంగా ఉన్నాయని ఆయన అన్నారు. చాలా చోట్ల నామినేషన్ కూడా చేయలేని పరిస్థితులు ఉన్నా, ఎన్ని ఫిర్యాదులు చేసిన ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని అన్నారు.
ఎన్నికల కమిషన్ ఈ విషయమై కోర్టు ముందు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల వాయిదా అనంతరం మరల ఇదే విధమైన అన్యాయాలు, కిడ్నాప్ లు చోటుచేసుకుంటాయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలు నిర్వహించాలని లింగారెడ్డి డిమాండ్ చేశారు.