34.7 C
Hyderabad
May 5, 2024 02: 07 AM
Slider నిజామాబాద్

బిచ్కుంద లో బిసి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

#kalyanalaxmi

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో బీసీ కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపీపి అశోక్ పటేల్ చేతుల మీదుగా పంపిణీ ప్రక్రియను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లికి తనవంతు సహకారం గా ఈ కళ్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టిందన్నారు.

కళ్యాణలక్ష్మి కాకుండా రైతుబంధు రైతుబీమా, ఆసరా పెన్షన్లు ,ప్రతి కుటుంబానికి రేషన్ బియ్యం పెంపు, కెసిఆర్ కిట్, కల్యాణలక్ష్మి ద్వారా  ఆడపిల్లల పెళ్ళిళ్ళ వయసును పటిష్టంగా అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు  మాతృ మరణాల సంఖ్య తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి ఎన్నో  సంక్షేమ పథకాలను తెరాస ప్రభుత్వం   ప్రవేశ పెట్టిందన్నారు.

మన మందరం ఆలోచించాల్సింది  తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్  సారధ్యాన్ని మనం ఎప్పుడూ బలపరచాల్సిందే నని ఆయన అన్నారు. ప్రతి ఒక కుటుంబం ఏదొక రూపంలో ప్రభుత్వ సాయం పొందుతుందన్నారు.

అనంతరం ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు బీసీ కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీతోపాటు వైస్ ఎంపీపీ రాజు పటేల్, తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయి, సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ(బాలు),మార్కెట్ కమిటీ అధ్యక్షులు మల్లిఖార్జున్ మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, మాజీ జడ్పీటీసీ సాయిరామ్,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజు  పటేల్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు  సిదిరం   పటేల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సాయిలు,రెవెన్యూ సీనియర్ సహాయకులు రాచప్ప,తెరాస ప్రధాన కార్యదర్శి రాం చందర్,కోఆప్షన్ సభ్యులు జావిద్  ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

జీ.లాలయ్య, సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్

Related posts

కొత్త జిల్లా ఏర్పాటు జంగారెడ్డిగూడెం కు లాభమా? నష్టమా?

Satyam NEWS

మనం సైతం కాదంబరికి గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం

Satyam NEWS

‘క్షీర సాగర మథనం’ పాటకు పట్టాభిషేకం!!

Satyam NEWS

Leave a Comment