40.2 C
Hyderabad
May 6, 2024 17: 24 PM
Slider నల్గొండ

డిఎస్పీ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం

#hujurnagarpolice

హుజుర్ నగర్ మండల గణేష్ మండపాల నిర్వహకులతో, గ్రామ పెద్దలతో హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ నందు కోదాడ డిఎస్పీ,సిఐ హుజుర్ నగర్  ఆధ్వర్యంలో హుజుర్ నగర్ పి.యస్ నందు మీటింగ్ నిర్వహించారు.

వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు ఆన్ లైన్ ద్వారా పోలీసువారికి దరఖాస్తు చేసుకుని,అట్టి దరఖాస్తును,సంబంధిత పేపర్స్ పోలీస్ స్టేషన్లో అందించాలని అన్నారు.

వినాయకుని విగ్రహ నిర్వాహకులు వారి వివరాలు,కమిటీ సభ్యుల వివరాలను,ఫోన్ నెంబర్లను దరఖాస్తులో  నమోదు చేయవలసి ఉంటుంది అన్నారు.

గణేష్ ఉత్సవ నిర్వాహకులు కరెంటు సరఫరా కోసం ఎలక్ట్రిసిటీ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని,వినాయక విగ్రహాల వద్ద మైక్  పెట్టాలంటే దానికి డిఎస్పీ అనుమతి తప్పనిసరి తీసుకోవాలని, ఉత్సవ మండపాల వద్ద మైకులను ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలని అన్నారు.

వినాయక ఉత్సవాల మండపం నిర్వాహకులు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్న ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని, మండపాన్ని సరియగు సామర్థ్యంతో నిర్మించుకోవాలని,కరెంట్ కనెక్షన్ తీసుకునేటప్పుడు తగు విధముగా జాగ్రత్తలు తీసుకోవాలని,అఖండ దీపమును జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

వినాయకుని లడ్డుని ఎవరూ దొంగిలించకుండా తగిన జాగ్రత్త వహించాలని,మండపం నిర్వాహకులు 24 గంటలు మండపం వద్ద ఉండాలన్నారు.

మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు,భక్తి పాటలు మాత్రమే ప్లే చేయాలని,కరోనా నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని అన్నారు.వినాయక విగ్రహాల నిమజ్జనం ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్పిన రోజున చెప్పిన స్థలం,టైంకు చేయాలన్నారు.విగ్రహాల నిమజ్జనంకు ఉపయోగించే వాహనం కండీషన్ లో ఉండాలని,ఫ్యూయల్ సరిపడా ఉందా లేదా ముందుగా సరిచూసుకోవాలని, మండపాల వద్ద జరిగే చట్ట వ్యతిరేక పనులకు కమిటీ సభ్యులే బాధ్యత వహించాలని,డి.జే లకు అనుమతి లేదని, ఎవరైనా ఉల్లంఘించినట్లైతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

రాజకీయాలలోకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి?

Satyam NEWS

ఎన్నికల్లో ఈవీఎంలు రద్దుకు బిల్లు తీసుకురావాలి

Satyam NEWS

పెన్షన్లు తక్షణమే పంపిణీ చేయండి

Satyam NEWS

Leave a Comment