29.7 C
Hyderabad
May 4, 2024 03: 05 AM
Slider నిజామాబాద్

హత్య కేసును విజయవంతంగా ఛేదించిన కామారెడ్డి పోలీసులు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జరిగిన హత్య కేసు, చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. రెండు కేసులలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. బాన్సువాడ పట్టణంలోని తహసిల్ ఆఫీసు ముందు నూతనంగా నిర్మిస్తున్న రెండు భవనాల వద్ద వాచ్ మెన్ గా పని చేస్తున్న ఎడిగే పోషయ్య ఈ నెల 12 న హత్యకు గురయ్యాడన్నారు. భవనాల వద్ద ఇనుప రాడ్లు దొంగతనానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు చోరీ చేస్తుండగా వాచ్ మెన్ గమనించి వారిని నిలదీసాడన్నారు.

దొంగతనం బయట పడుతుందని భావించిన ముగ్గురు వాచ్ మెన్ బండరాయితో తలపై బాది హత్య చేశారన్నారు. హత్య జరిగిన స్థలంలో ముగ్గురు అనుమానాస్పదంగా తిరగడం సిసి టివిలో రికార్డు కావడంతో ముగ్గురిపై నిఘా పెట్టగా నిన్న మార్కెట్లో ఇనుప రాడ్లను అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు.

ముగ్గురు వ్యక్తులు ఎర్రమన్ను కుచ్చు తాడ్కోల్ గ్రామానికి చెందిన కడమంచి కిరణ్, టాక్ మహేందర్ సింగ్, మడత కిరణ్ లుగా గుర్తించడం జరిగిందన్నారు. వీరినుంచి టివిఎస్ ఎక్స్ ఎల్, కడియం, రాడ్ కటింగ్ మిషన్, దొంగిలించిన ఇనుప సలాకలు స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండుకు తరలించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. వీరిపై గతంలో దొంగతనం కేసులు ఉన్నాయని, వీరిపై పిడి యాక్టు నమోదుకు ప్రతిపాదిస్తామన్నారు.

అలాగే ఈ నెల 10 న బాన్సువాడ పట్టణంలోని బచ్చు భుజేందర్ ఇంట్లో 41 తులాల బంగారం, 15 వేల నగదు చోరీ జరిగినట్టు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ నెల 1 న బాధితుడు ఇంటికి తాళం వేసి సొంత పనిమీద భార్యతో కలిసి నిజామాబాదుకు వెళ్లి ఈ నెల 3 న ఇంటికి వచ్చారన్నారు. ఇంటికి వచ్చిన 5 రోజుల తర్వాత ఈ నెల 8 న బీరువాలో చూడగా అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదని తెలిపారు. విచారణ చేపట్టిన పోలీసులకు నేడు గాంధీ చౌక్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పధంగా తిరుగుతూ కనిపించగా పట్టుకోవడం జరిగిందన్నారు. తమ విచారణలో భుజేందర్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని ఒప్పుకున్నాడని తెలిపారు.

నిందితుడు రాజు విశ్వనాథ్ నాందేడ్ జిల్లాకు చెందిన వాడని, అతనికి ఐదుగురు ఆడపిల్లలు ఉండగా ఒక కూతురు పెళ్లి చేశాడని, మిగతా కూతుళ్ళ పెళ్లిళ్లు చేయడానికి జీతం సరిపోక ఈ దొంగతనం చేసినట్టు వెల్లడించాడని తెలిపారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను గ్రైండర్ లో దాచి పెట్టగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. నిందితున్ని రిమాండ్ కు తరలించడం జరుగుతుందన్నారు.

Related posts

అమెరికాలో కొలువుదీరిన “కూచిపూడి పలావ్”

Satyam NEWS

లాక్ డౌన్ కారణంగా ముంచుకొస్తున్న మరో ముప్పు

Satyam NEWS

ఉమామహేశ్వరి మరణం బాధాకరం

Satyam NEWS

Leave a Comment