Slider కవి ప్రపంచం

సత్యం శివం సుందరం

#Chintapatla Sudarshan

ఒకపూవు

పూయడాన్ని

అక్షరచిత్రంగా

మలిచాడు వెంకటచలం!

ప్రకృతిలోకి

అణువణువును

ఆదిఅంతమూలేని

ఒక మహాద్భుత

కళాఖండంగా

తీర్చిదిద్దాడు సృష్టికర్త!

పూవూ,తీగా,మహావృక్షం

కనుచూపుమేర

విస్తరించే హరితవనం

కొండల గుండెలను మీటే

జలజలగీతం

కాలికింద మెత్తగా

తివాచీ పరిచే గడ్డి

విశాల ఆకాశంలో

విహరించే విహంగం

నాగుపాము పుట్టా

వానపాము తొలిచే మట్టి

సమస్తం సుందరం సురుచిరం

నిత్యం సత్యం శివం శాశ్వతం!

కవిత్వం అజరామరం!!

-చింతపట్ల సుదర్శన్  9299809212

Related posts

అతనో పాఠ్యాంశం

Satyam NEWS

ఏప్రిల్ 10వ తేదీ నుండి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

తహసీల్దార్ ఆఫీస్ కు తాళి ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్

Satyam NEWS

Leave a Comment