37.7 C
Hyderabad
May 4, 2024 11: 17 AM
Slider హైదరాబాద్

నీలోఫర్‌ హాస్పిటల్‌ లో మౌలిక వసతులకు ఏడీపీ సాయం

#niloufer hospital

మానవ వనరుల నిర్వహణ సాఫ్ట్‌వేర్‌ సేవలను అందించడంలో అగ్రగామి సంస్థ అయిన ఏడీపీ, ప్రీమియం ఐసీయు యంత్ర సామాగ్రిని హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి విరాళంగా అందజేసింది. కోవిడ్‌ ఉపశమన ప్రయత్నాలకు అదనంగా, ఈ కంపెనీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటుగా ఐసీయు పడకల లభ్యతను వృద్ధి చేస్తూనే, కరోనా వైరస్‌ మూడో వేవ్‌ భయాల వేళ ఆ ముప్పును ఎదుర్కొనేందుకు ఆస్పత్రిని  సిద్ధం చేస్తూ తగిన యంత్ర సామాగ్రినీ అందిస్తుంది.

కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ ప్రభావం తో తీవ్రంగా నష్టపోయిన మనదేశం ఇప్పుడు మూడోవేవ్‌ ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది. ఈ మూడో వేవ్‌ ప్రధానంగా చిన్నారులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.  అందుచేత, తక్షణమే ఈ ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధం కావడంతో పాటుగా అవసరమైన  సహాయాన్ని సైతం అందించాల్సి ఉంది. దీనిలో భాగంగా ఏడీపీ ఇండియా 10 పడకల ఐసీయు వార్డ్‌తో పాటుగా అది పూర్తిగా పనిచేసేందుకు అవసరమైన యంత్రసామాగ్రిని  సైతం అందిస్తుంది.

ఈ కంపెనీ ఇప్పుడు కార్డియాక్‌ మానిటర్లు, వెంటిలేటర్లు, బెడ్స్‌, ఈసీజీ మెషీన్లు, బైపాప్‌ మెషీన్లు, డిఫిబ్రిల్లేటర్స్‌,  నర్సింగ్‌ స్టేషన్‌కు అవసరమైన యంత్రసామాగ్రి, ఎయిర్‌ కండీషనింగ్‌, లారిన్గోస్కోప్స్‌ మరియు ఐసీయు సిరెంజ్‌ పంపులు వంటివి అందించింది.

‘‘మొదటగా, నేను ఆస్పత్రులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, శానిటేషన్‌ వర్కర్లు, పోలీసులు, ఎన్‌జీవోలు, అసంఖ్యాక వలెంటీర్లు మరియు మహమ్మారి విజృంభణ సమయంలో కమ్యూనిటీలను కాపాడేందుకు శ్రమిస్తూ అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను. ఈ భాగస్వామ్యంతో, ఏడీపీ ఇండియా ఇప్పుడు అధికారులకు ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపరచడంలో సహాయపడటాన్ని లక్ష్యంగా చేసుకుంది. తద్వారా పరిిస్థితులతో సంబంధం లేకుండా  తగినంతగా వైద్య సంరక్షణ లభిస్తుందనే భరోసానూ అందిస్తుంది’’ అని డాక్టర్‌ విపుల్‌ సింగ్‌, డివిజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌–హెచ్‌ఆర్‌, ఏడీపీ ఇండియా అన్నారు.

‘‘మహమ్మారి సమయంలో  మా మద్దతును ఆశించిన  ప్రజల అవసరాలను గుర్తించడంలో చురుకైన పాత్రను ఏడీపీ పోషించింది.  మా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, నిరుపేదలకు  శుభ్రతా కిట్‌ల పంపిణీ కార్యక్రమం, దృష్టిలోపంతో పాటుగా ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారులు మరియు అల్పాదాయ కుటుంబాలలోని బాలికలకు వర్ట్యువల్‌ విద్య మద్దతు అందించడం వంటి కార్యక్రమాలకు ఇది అదనం. ఓ కమ్యూనిటీగా, మరియు ఫ్రంట్‌లైన్‌ వారియర్ల మద్దతుతో ,  మనమంతా సాధారణతకు ఓ అడుగు దగ్గరగా రాగలమని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు.

ఈ కార్యక్రమం గురించి తెలంగాణా రాష్ట్ర  వైద్య విద్య, డైరెక్టర్‌ రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ సంక్షోభ సమయంలో నీలోఫర్‌ ఆస్పత్రికి తోడ్పాటునందించిన ఏడీపీ ఇండియాకు కృతజ్ఞతలు. ఈ ఆస్పత్రి కేవలం తెలంగాణా రాష్ట్రంలోని చిన్నారులకు మాత్రమే వైద్య చేయడం లేదు. ఏపీ, కర్నాటక  మరియు దగ్గరలోని  రాష్ట్రాల చిన్నారులకూ వైద్య సేవలను అందిస్తుంది’’ అని అన్నారు.

‘‘ఏడీపీ ఇండియా నుంచి తాము అందుకున్న సహాయానికి కృతజ్ఞతలు.  ఈ కార్యక్రమం ద్వారా అవసరమైన యంత్రసామాగ్రి లభించడంతో పాటుగా మరింత మందికి సేవలనందించేందుకూ తోడ్పాటునందించింది. దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్నీ కూడా పూర్తి స్ధాయిలో నిర్వహించతగిన ఐసీయుల కోసం సిద్థమవుతున్న వేళ, ఏడీపీ ఇండియా అందించిన ఈ తోడ్పాటు స్వాగతించతగినది. అవసరమైన ప్రతి ఒక్కరికీ వైద్య సేవనందించాలనే మా నిబద్ధతకు ఇది మద్దతునందిస్తుంది’’ అని మురళీకృష్ణ, సూపరింటెండ్‌, నీలోఫర్‌ హాస్పిటల్‌ అన్నారు.

Related posts

ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు: పలువురిని ఆకర్షించిన ప్రదర్శనలు

Satyam NEWS

విజయ్ సేతుపతి నిహారిక కొణిదెల జంటగా “ఓ మంచి రోజు చూసి చెప్తా”

Satyam NEWS

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటియేషన్ కార్డులు

Satyam NEWS

Leave a Comment