కవి ప్రపంచం

అతనో పాఠ్యాంశం

#V P Chandarrao

పుంభావసరస్వతి

సహన సంస్కార స్నేహశీలి

సహజ రాజకీయ ప్రతిభాశాలి

సౌజన్యముట్టిపడే మన పివి…

సుదీర్ఘ జీవితాన

ఉత్థాన పతనాలు చూసిన వ్యక్తి

స్వశక్తితో దూరతీరాలు

పయనించిన శక్తి…మన పివి

మూర్తీభవించిన

భారతీయ బహుభాషా ధీశక్తి

మచ్చెరుగని అతి స్వచ్చమైన

అపర చాణక్యయుక్తి మన పివి

కోపతాపాలు కనిపించని

రాగద్వేషాలు వినిపించని

తెలంగాణా తేజస్సు

తేటతెలుగు ఓజస్సు మన పివి

బయట దేశ దేశాలను చుట్టి

తెలుగు ప్రతాపం

లోకానికి చూపెట్టిన

“లోపలి మనిషి” మన పివి…

“ఢిల్లీకి రాజునైనా

తల్లికి కొడుకునే” అని

పుట్టి పెరిగిన పల్లెను మరచిపోని మాన్యులు పివి

ఆర్థిక సంస్కరణలు చేపట్టి

దేశ సౌభాగ్యాన్ని సంరక్షించిన

అపర చాణక్య రాజ నీతిజ్ఞుడు

సుపరిపాలనా దక్షులు శ్రీ పివి…

భారత పూర్వ అపూర్వ ప్రధాని

పుంభావ సరస్వతి

శ్రీ పివి.నరసింహారావుగారి

శతజయంతి వేళ అక్షర నివాళి

విపి.చందన్ రావు, నిజామాబాద్, సెల్ నెం: 94400 38565

Related posts

ఊరించకే ఉగాది

Satyam NEWS

ఒక్కమాట విను…

Satyam NEWS

మరలిరా..

Satyam NEWS

Leave a Comment