29.7 C
Hyderabad
May 4, 2024 03: 47 AM
Slider మహబూబ్ నగర్

1969 బ్యాచ్ ZPHS  కొల్లాపూర్ HSC  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

#kollapur

ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్న ఆనందం వారిలో నిండిపోయింది….. కష్టసుఖాలు కలబోసుకున్నారు. పాత విషయాలు చర్చించుకున్నారు… నూతన ఉత్సాహం నింపుకున్నారు.  1969 బ్యాచ్ ZPHS  కొల్లాపూర్ HSC  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. హైదరాబాద్ బృందావనం హాల్ లో ఈ కార్యక్రమాన్ని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యక్తిగత కార్యదర్శి జె వి రామారావు (బుచ్చిబాబు) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ యo ఎల్ సి జగపతి రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 1969 బ్యాచ్ కొల్లాపూర్ zphs స్కూల్ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడంతో సందడిగా జరిగింది. భవిష్యత్తు లో కొల్లాపూర్ లో 1969 బ్యాచ్ సభ్యుల ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొల్లాపూర్ లో చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు.

Related posts

ఇదేమి దారుణం? ఇంత దిగజారుడుతనమా?

Satyam NEWS

నదీ జలాలపై శాస్త్రీయ పరిష్కారం అవసరం

Satyam NEWS

టీవీ సామ్రాజ్యమా ఊపిరి పీల్చుకో కారోనా లేదు

Satyam NEWS

Leave a Comment