27.7 C
Hyderabad
May 4, 2024 08: 57 AM
Slider మహబూబ్ నగర్

సంక్రాంతికి ఊరికి వెళితే ముందస్తు సమాచారం ఇవ్వండి

#KollapurPolice

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సర్కిల్ ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండుగ సందర్భంగా ఊర్లోకి వెళ్లే ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని  కొల్లాపూర్ సీఐ బి.వెంకట్ రెడ్డి బుదవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పండుగ సమయంలో  తాళాలు ఉన్న ఇళ్లపై దొంగలు నిఘా  పెట్టుకొని వుంటారాన్నారు. ఇళ్ల తాళాలు పగులకొట్టి చోరీకి పాల్పడి విలువైన సామాగ్రిని దొంగలించే అవకాశాలు ఉంటాయన్నారు. అందుకే ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని  సూచించారు. ప్రజల భద్రత  పోలీసుల బాధ్యత కాబట్టి  ప్రజలను సూచించారు.  ప్రజలు,ముఖ్యంగా ఉద్యోగులు తమ ఇళ్లలో ఉండే విలువైన సామాగ్రిని పై జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ముందస్తుగా  పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే ఆ ప్రాంతంలో పోలీసుల  ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. అదే విధంగా అనుమానితులు ఎవరైనా  కనిపించినట్లైతే  పోలీసులకు లేదా 100 డయల్ కు   సమాచారం ఇవ్వాలని సీఐ బి. వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా ప్రజలను కోరారు. కొత్త వారిని ఎవరిని నమ్మవద్దన్నారు. అదే విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా కోవీడ్ నియమ నిబంధనలు పాటించాలని,కచ్చితంగా మాస్క్ ధరించాలని  ప్రజలను కోరారు. మనం బాగుంటే అందరూ బాగుంటారు. అందరి ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

24 నుంచి ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

రాహుల్ యాత్ర: కాంగ్రెస్ కు కలిసివచ్చిందా?

Bhavani

గుర్తుందా శీతాకాలం ఈ జనరేషన్ కు గీతాంజలి

Bhavani

Leave a Comment