33.2 C
Hyderabad
May 4, 2024 01: 41 AM
Slider ముఖ్యంశాలు

షెడ్యూల్ ప్రకారం లైసెన్స్ ప్రక్రియ పూర్తి చేయాలి

#Shanti Kumari

2023-25 సంవత్సరాలకు ఏ4 రిటైల్ షాపుల లైసెన్స్ ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్ నుండి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఏ4 రిటైల్ షాపుల లైసెన్స్ లపై ప్రక్రియపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2023-25 నకు గాను షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్లు గౌడ, ఎస్సి, ఎస్టీలకు కేటాయించే షాపుల లాటరీలు తీయాలన్నారు. ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని, ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేయాలని ఆమె అన్నారు. ఈ నెల 4 న నోటిఫికేషన్ విడుదల చేసి, అదే రోజు నుండి ఈ నెల 18 సాయంత్రం 6.00 గంటల వరకు అన్ని పని దినాలలో దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు.

లైసెన్సుల లాటరీ ప్రక్రియ ఈ నెల 21న చేపట్టాలని సీఎస్ తెలిపారు. ఏ4 రిటైల్ షాపులకు ఎక్సైజ్ ట్యాక్స్ మొదటి వాయిదా మొత్తం ఈ నెల 21, 22 తేదీల్లో చెల్లించాల్సి ఉంటుందని, నవంబర్ 30 నుండి కొత్త షాపులకు స్టాక్ విడుదల చేయనున్నట్లు, డిసెంబర్ 1 నుండి షాపులు ప్రారంభం కానున్నట్లు ఆమె అన్నారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు.

Related posts

డీ జీ పీ చేతుల మీదుగా అవార్డు లు అందుకున్న ఎస్పీలు

Satyam NEWS

ములుగు  జిల్లా కేంద్రంలో తైక్వాండో పోటీలు ప్రారంభం

Satyam NEWS

రైస్ మిల్లు కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలి

Satyam NEWS

Leave a Comment