40.2 C
Hyderabad
April 29, 2024 18: 50 PM
Slider ఖమ్మం

ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారుచేయాలి

#Collector Dr. Priyanka

జిల్లా ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. ఐడిఓసి కార్యాలయంలో జిల్లా ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపకల్పన పై ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సక్రమంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు జిల్లా ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ అత్యంత ముఖ్యమని చెప్పారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా జిల్లా ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయాలని చెప్పారు.

ఈ ప్రణాళిక వల్ల ఎన్నికలు ప్రక్రియ అంత సులువుగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ ప్రణాళిక పర్యవేక్షణకు జిల్లా అధికారులను నియమించినట్లు చెప్పారు.

ఈ సమావేశంలో ఐటీడీఏ పిఓ ప్రతీక్ జైన్, జిల్లా ఎన్నికల మేనేజ్మెంట్ ప్లాన్ ప్రత్యేక అధికారులు సంజీవరావు, మనోహర్, వేణు, విద్యాలత, వెంకటేశ్వర్లు, శ్రీనివాస రావు, భద్రాచలం ఆర్డీఓ మాధవి, సహాయ ఎలక్ట్రో రిజిస్ట్రే షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related posts

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

Satyam NEWS

బలమైన ఆధారాలు ఉన్నాయన్న సజ్జల

Satyam NEWS

హమారామన్ కీ బాత్ : రాజధానిగా అమరావతి:ప్రధానికి ఫోన్ కాల్స్

Satyam NEWS

Leave a Comment