29.7 C
Hyderabad
April 18, 2024 04: 25 AM
Slider ప్రత్యేకం

తెలంగాణ లో బీజేపీ ఎన్నికల శంఖారావం

#sankalpyatra

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరశంఖం పూరించింది. కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేలా, రాష్ట్రంలోని 17కు 17 సీట్లలో విజయం సాధించే లక్ష్యంతో విజయసంకల్ప యాత్రను ప్రారంభించింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చి, నరేంద్ర మోదీ ని మూడోసారి ప్రధానమంత్రిని చేసే కార్యక్రమంలో తెలంగాణ ప్రజలను భాగస్వాములను చేసేలా, తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రజల ఆశీర్వాదం తీసుకునేలా చేపట్టిన విజయసంకల్ప యాత్రకు అద్భుత స్పందన లభించింది. ఎక్కడికెళ్లినా పెద్దఎత్తున జనం తరలివచ్చారు. 4 క్లస్టర్లలో జరిగిన విజయసంకల్ప యాత్రలో మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తరలివచ్చి మద్దతు తెలిపారు. అన్ని నియోజకవర్గాల నుంచి అంచనాలకు మించి భారతీయ జనతా పార్టీకి స్పందన లభిస్తోంది.

విజయసంకల్ప యాత్రల్లో కేంద్ర మంత్రి, బీజేపీ రథసారధి కిషన్ రెడ్డి, ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ శాసనసభ్యులు ఈటల రాజేందర్, ఇతర నాయకులు ఆయా క్లస్టర్ల పరిధిలో పాల్గొన్నారు. కార్నర్​ మీటింగులకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రలతో ప్రజలకు వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ, అవినీతి రాజకీయాలను ఎండగట్టారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించి, మద్దతు కూడగట్టారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఇస్ బార్…చార్ సౌ పార్ అనే నినాదాలతో దారిపొడవునా బీజేపీ శ్రేణులు, ప్రజలు హోరెత్తించారు. 

కొమురం భీం క్లస్టర్

ఆదిలాబాద్ జిల్లా బాసర అమ్మవారి ఆశీస్సులతో యాత్ర ప్రారంభమైంది. ముథోల్‌ నియోజకవర్గంలోని భైంసాలో యాత్ర ప్రారంభోత్సవానికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ యాత్రలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాయల్ శంకర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాజరాజేశ్వరి క్లస్టర్

వికారాబాద్ జిల్లా చేవెల్ల పార్లమెంటు నియోజకవర్గంలోని తాండూరులో కేంద్రమంత్రి కేంద్ర మంత్రి బీఎల్ వర్మతో కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు.  ఈ యాత్రలో శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

భాగ్యనగర్ క్లస్టర్

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆశీస్సులతో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ యాత్రను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. ఈ యాత్రలో బీజేపీ మాజీ శాసనసభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణమ్మ క్లస్టర్

నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామంలొ కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల తో కలిసి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేపటి నుంచి మరో పదిరోజుల పాటు కొనసాగనున్న విజయ సంకల్ప యాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని నరేంద్ర మోదీ ని మూడోసారి ప్రధానిగా చేసుకునే సంకల్పంలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యమవ్వాలని దుగ్యాల ప్రదీప్ కుమార్ పిలుపునిచ్చారు.

Related posts

ఇద్దరు పసిపిల్లలను ఉరి వేసి హత్య చేసిన తల్లి

Satyam NEWS

మావో ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం

Satyam NEWS

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపెట్టిన నాసా

Satyam NEWS

Leave a Comment