31.7 C
Hyderabad
May 7, 2024 01: 41 AM
Slider హైదరాబాద్

26న ప్రారంభం కానున్న లులూ మాల్

#Lulu Mall

యూఏఈకి చెందిన ప్రఖ్యాత లులూ గ్రూప్‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన మెగా షాపింగ్‌ మాల్‌ను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఈ నెల 26న ప్రారంభించనున్నారు. గత ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణలో పెట్టుబడుల కోసం లులూ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందుకు అనుగుణంగా తమ సంస్థ తరఫున రూ.300 కోట్లతో దేశంలో అతి పెద్ద షాపింగ్‌ మాల్‌ను కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసింది. 5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో గల ఈ మాల్‌ ద్వారా 2 వేల మందికి ఉపాధిలభించనుంది. ఇందులో 200కుపైగా షాపులు ఉంటాయి. 1400 సీట్ల సామర్థ్యంతో 5 సినిమా స్క్రీన్లు అందుబాటులో ఉంటాయి.

ఒకేసారి 3 వేల కార్లను పార్కింగ్‌ చేసే వీలుంది. మల్టీ కుషన్‌ ఫుడ్‌ కోర్టు, పిల్లల వినోద కేంద్రాన్నీ నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా వచ్చే అయిదేళ్లలో రూ.3,500 కోట్లతో హైదరాబాద్‌ శివారుతోపాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో మినీ మాల్స్‌ ఏర్పాటు చేయాలని లులూ గ్రూపు సంకల్పించింది.

Related posts

లారీ క్యాబిన్ లో ఎసీ తప్పనిసరి

Bhavani

మర్డర్ ఏ ఒక్కరి కుటుంబ కధ కాదు

Satyam NEWS

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసు కస్టడీలో జేసీ

Satyam NEWS

Leave a Comment