26.7 C
Hyderabad
May 3, 2024 08: 52 AM
Slider అనంతపురం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసు కస్టడీలో జేసీ

#JCPrabhakarareddy

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. తాడిపత్రికి సమీపంలోని జమ్ములదిన్నెలో సీఐ దేవేందర్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి దూర్భాషలాడారనే ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

ఈ కేసులో కడప జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రభాకర్‌రెడ్డిని ఆదివారం ఉదయం పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన  అనంతరం మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు.

తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు ప్రభాకర్‌రెడ్డిని విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు కడప జైలుకు తరలించనున్నారు.

Related posts

తిరుచానూరు లో దర్శన ఏర్పాట్ల పర్యవేక్షణ

Satyam NEWS

పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం

Satyam NEWS

గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వ ఆంక్షలపై వెల్లువెత్తిన నిరసనలు

Satyam NEWS

Leave a Comment