Slider మెదక్

ఐ డోనర్: హెటేరో తో వేలాది మందికి కంటి వెలుగు

lv prasad eye siddipet hareesh

వేలాది మందికి కంటి వెలుగును ఇచ్చిన వ్యక్తి హెటేరో ఛైర్మెన్ పార్థసారథి రెడ్డి అని మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాగులబండలో నూతనంగా నిర్మించిన, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి 1987 ప్రారంభం చేసి, నాలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. బంజారాహిల్స్ ఆసుపత్రిలో ఏ వైద్య సామగ్రి ఉందొ, సిద్దిపేట ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కూడా అదే ఉంటుందన్నారు. .

నాలుగు రాష్ట్రాల్లో 19 ఎల్వి ప్రసాద్ సెంటర్లు ఉన్నాయని, హైదరాబాద్ లో రూ. 400కోట్లతో పార్థసారథి రెడ్డి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. మొదటగా సిద్దిపేటలో క్యాన్సర్ స్కీనింగ్ సెంటర్ ఏర్పాటు చెయ్యాలని ఆయన కోరారు.జిల్లా చుట్టూపక్కాల ఉన్న 5లక్షల ప్రజలు కంటి చూపు, బీబీ, షుగర్ ఉన్నవాళ్లు వినియెగించుకోవాలని తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి చైర్మన్‌ జీఎన్‌రావు, హెటిరో డ్రగ్స్‌ చైర్మన్‌ పార్థసారథి, ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి, జెడ్పీచైర్మన్‌ వేలేటి రోజారాధాకృష్ణ పాల్గొన్నారు.

Related posts

విధానాల రూపకల్పనతోపాటు అమలు కూడా ముఖ్యమే

Satyam NEWS

ఇడుపులపాయకు చేరిన ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS

ఇ ఎస్ ఐ సి ఆసుపత్రి సిబ్బందికి వేధింపుల కరోనా

Satyam NEWS

Leave a Comment