38.2 C
Hyderabad
April 29, 2024 13: 09 PM
Slider మహబూబ్ నగర్

స్పీడ్ పెంచిన జూపల్లి: ఇక కొల్లాపూర్ రంగస్థలమే

#jupally

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయంగా తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి తెలంగాణ ఉద్యమ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన రాజకీయ వేగాన్ని పెంచారు. నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ అనుచరులతో సమావేశాలు అవుతున్నారు. కంటికి కునుకు లేకుండా హైదరాబాద్ కు రాత్రి 12 గంటలకు వెళ్లిన ఉదయం 5 గంటల వరకు కొల్లాపూర్ కి చేరిపోతున్నారు.

దీని బట్టి జూపల్లి ఏ విధంగా పర్యటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి జూపల్లి 60 ఏళ్ల పై వయసులో కూడా ఆయన వేగాని  మరింత పెంచారు.. గత 20 ఏళ్ల కాలంలో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగిన సమయంలో కొల్లాపూర్ నియోజక వర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో కరపత్రాలు ద్వారా పంపిణీ చేస్తూ, తన అనుచరులతో సమావేశమయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా తన ఉద్యమ క్యాలెండర్ ఆవిష్కరించి పంపిణీ చేస్తూ అనుచరులతో సమావేశాలయ్యారు.

ఇలా జూపల్లి ఏదో రూపంలో నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. 2018ఆయన ఓటమి  అనంతరం  నా చివరి శ్వాస కొల్లాపూర్ ప్రజలతోనే అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్లారు. ముఖ్యంగా ప్రజల సమస్యలపైనే ఆయన దృష్టి సారించారు. ఇప్పుడు మరోసారి ఆయన అనుచరులతో సమావేశాలు అవుతున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మరో చర్చ జరుగుతుంది.

ఆయన రాజకీయంగా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటున్నారని మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే జూపల్లి అంటే సింహం అనే పేరు కూడా వచ్చేసింది. బయట ప్రచారం ఏ విధంగా జరిగిన ఆయన నుండి ఎలాంటి మాటలు అయితే రాలేదు. ఎక్కడ ఉన్న ఆత్మగౌరవంతో ఉండాలనేది జూపల్లి నైజం అని అనుచరులు అంటున్నారు.. మరి ఉగాది సమయానికి జూపల్లి ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు అనే మాటలు కూడా బాగానే వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఓవైపు ముందస్తు అంటూ మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు సాధారణ ఎన్నికలు కూడా 9,10నెలల ఉన్నాయి. సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందే ప్రభుత్వం రద్దు చేయాల్సి వస్తుంది. ఆయన ఈ అంశాన్ని ఊహించే ఎన్నికల కు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే కంటికి కునుగు లేకుండా నియోజకవర్గంలో పర్యటిస్తున్నాట్లు కనిపిస్తుంది.

ఈ నాలుగేళ్లలో జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో నియోజకవర్గ ప్రజలు చూస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఒకరికి అభినందనలు తెలపాలి అనే పోస్ట్ పెట్టుకోవడానికి కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫోన్లు చేసి అలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే  నియోజకవర్గ పరిస్థితులు  ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్రమ కేసులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న సమయంలో జూపల్లి గల మెత్తారు..చివరికి జూపల్లి పై కూడా కేసులు అయిన సంగతి  తెలిసిందే.

మరోవైపు జూపల్లి సైన్యం కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. జూపల్లి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పని చేస్తామని అనుచరులు అంటున్నారు.ప్రస్తుతం జూపల్లి  స్పీడ్ అయితే పెంచారు. వస్తున్న సర్వేలలో కూడా జూపల్లికి అనుకూలంగా ఉన్న సంగతి కూడా తెలిసిందే. మరి రానున్న రోజుల్లో జూపల్లి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో,  ఏ విధంగా ఏ పార్టీ నుండి రాబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు నాయకుల వ్యక్తిగతంగా కాకుండా  ఆయా పార్టీల కోసం పని చేసే నాయకులు జూపల్లి మా పార్టీ నుండి పోటీ చేస్తే కొల్లాపూర్ కోటపై జెండా ఎగిరే వేయవచ్చు అనే కోణంలో ఆలోచిస్తున్నారు.మరీ రానున్న రోజుల్లో  జూపల్లి    రాజకీయం ఏ విధంగా చేయబోతున్నారో చూడాలి. కొల్లాపూర్ రంగస్థలంలో జూపల్లి పాత్ర  ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరు ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు.

Related posts

కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాలి

Satyam NEWS

స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయం: ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

ఎన్ కౌంటర్ మృతుల బాడీలను ఇక కాపాడలేం

Satyam NEWS

Leave a Comment