34.7 C
Hyderabad
May 5, 2024 00: 43 AM
Slider మహబూబ్ నగర్

భౌరపూర్ శివపార్వతుల కల్యాణోత్సవానికి సకల ఏర్పాట్లు

#nagarkurnool

శివరాత్రి రోజున చెంచులు భక్తి శ్రద్ధలతో జరిపే శివపార్వతుల కల్యాణోత్సవం కార్యక్రమం భౌరపూర్ జాతరను సకల సౌకర్యాలతో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. 

శుక్రవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కె. మనోహర్ తో కలిసి లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భౌరపూర్ జాతరకు వచ్చే చెంచులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చాలని అందుకు వివిధ శాఖల అధికారులకు బాధ్యతలను అప్పగించారు. అయితే ఎక్కడ ప్లాస్టిక్ వినియోగం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. 

మంచినీరు, భోజనం తదితర అన్ని విషయాల్లో ప్లాస్టిక్ ఎక్కడ వినియోగించకుండా ప్లాస్టికేతర వస్తువులను వాడవలసిందిగా ఆదేశించారు.  ఆలయం అలంకరణ, విద్యుదీకరణ, వైద్య సదుపాయాలు, 108, ఫైర్ వాహనం, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం వంటి మౌళిక సదుపాయం తో పాటు చెంచు భక్తులకై ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. 

పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అవసరమైన మేరకు సిబ్బందిని, వలంటీర్లను నియమించి ఎక్కడ అపరిశుభ్రత లేకుండా చూసుకోవాలని పంచాయతీరాజ్, అటవీ, ఐ.టి.డి.ఏ తో పాటు స్వచ్చంద సంస్థల సేవలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు.  గత సంవత్సరం కంటే ఈ సారి ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందని దీనికి అనుగుణంగా పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. 

లా అండ్ ఆర్డర్ విషయంలో సైతం పోలీస్ శాఖ అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ లో కానీ మరెక్కడా ఏ సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు.  అక్కడక్కడ అవసరమైన చోట సిసి టీవీలు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను సూచించారు.   భక్తులకు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు వంటివి నిర్వహించాలని ఆదేశించారు. 

భౌరపూర్ జాతర తో పాటు శివరాత్రి సందర్బంగా  శ్రీశైలం వెళ్లే భక్తులకు  పాతాళ గంగ వద్ద భక్తులు స్నానం ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా సూచనలు జారీ చేశారు. మార్గ మాధ్యమంలో పెంటల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు.

భక్తులకు  మార్గమధ్యలో ఏమైనా సమస్యలు ఉత్పన్నం అయితే వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  ఈ మొత్తం కార్యక్రమానికి నోడల్ అధికారిగా అచ్చంపేట ఆర్.డి.ఓ ను నియమిస్తున్నట్లు తెలియజేసారు.  భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు మ్యాపింగ్ చేసి వారికి ఎక్కడ ఏ సదుపాయం ఉందో తెలిసే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కె. మనోహర్, అదనపు కలెక్టర్ మను చౌదరి, పి.ఓ. ఐ.టి.డి.ఏ అశోక్, డి.ఎఫ్.ఓ కిష్టా గౌడ్, వైద్య అధికారి సుధాకర్ లాల్, డి.పి.ఆకృష్ణ, డి.ఈ ఆర్.డబ్ల్యూ.ఎస్. హేమలత, డి.ఎస్.పి లు. అచంపేట, నాగర్ కర్నూల్, ఫైర్ అధికారి కృష్ణమూర్తి,  ఆర్.డి.టి స్వచ్చంద సంస్థ సభ్యులు సరస్వతి, డి.పి.యం తదితరుల పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్య న్యూస్ నెట్. నాగర్ కర్నూల్

Related posts

స్విమ్మింగ్: 4 బంగారు పతకాలు సాధించిన షేక్ ఖాజా

Satyam NEWS

విశాఖలో అదృశ్యమైన సాయిప్రియ కేసులో కొత్త ట్విస్ట్‌

Satyam NEWS

మన సరిహద్దుల్లో చైనా కొత్త ఎత్తుగడ

Satyam NEWS

Leave a Comment