34.7 C
Hyderabad
May 4, 2024 23: 32 PM
Slider మహబూబ్ నగర్

రాష్ట్ర వ్యాప్తంగా మాలలను చైతన్యం చేయాలి

#malamahanadu

తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య

తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు గుంత లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య హాజరయ్యారు. హన్వాడ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మల్లు మనోజ్ కుమార్ ను జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఆయన నియమించి నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో మాలలు పూర్తిగా వెనుకబాటుకు గురయ్యారని, ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఆలయ ప్రవేశాలు కూడా నిషేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం దళిత శివ స్వాములను, అయ్యప్ప స్వాములు ఆలయాలకు రానివ్వకుండా పూజలు చేయనీయకుండా అంటరానితనం పాటిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో దళితులను చైతన్యం చేసి సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి కృషి చేయాలని అన్నారు.

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రతి గ్రామగ్రామాన మాలలను   చైతన్యం చేసి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలతో, స్వర్గీయ పివి రావు ఆలోచనా విధానంతో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమితులైన మల్లు మనోజ్ కుమార్ మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి బాధ్యత ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్యకు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులుకు, జిల్లా అధ్యక్షులు గుంత లక్ష్మయ్య కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తన బాధ్యతను సక్రమంగా నిర్వహించి మాలలను చైతన్యం చేసి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో భాగస్వాములను చేసి, మాలల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు,  జిల్లా అధ్యక్షులు గుంత లక్ష్మయ్య, జిల్లా కార్యదర్శి కాడం రాఘవేందర్, జిల్లా సహాయ కార్యదర్శి బ్యాగరి వెంకటేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సాతర్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

భారత్ లో కరోనా కట్టడికి సాయం అందిస్తున్న అమెరికా

Satyam NEWS

మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ దుర్మరణం

Satyam NEWS

వాంటెడ్ జస్టిస్: సంక్షేమంలో దివ్యాంగుల వాటా ఏదీ?

Satyam NEWS

Leave a Comment