31.2 C
Hyderabad
May 12, 2024 01: 25 AM
Slider నిజామాబాద్

వాంటెడ్ జస్టిస్: సంక్షేమంలో దివ్యాంగుల వాటా ఏదీ?

divyang

విద్యా ఉపాధి కోసం ఆత్మగౌరవ హక్కుల సాధన కోసం జరిగే పోరాటాలకు దివ్యాంగులు సిద్ధం కావాలని ఎన్పిఆర్డి  రాష్ట్ర కార్యదర్శి అడివయ్య పిలుపునిచ్చారు. దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక కామారెడ్డి జిల్లా ద్వితీయ మహాసభలు బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో నిర్వహించారు.

మహాసభలనుద్దేశించి అడివయ్య మాట్లాడుతూ మార్చి 7 8 9 తేదీల్లో భువనగిరి పట్టణంలో సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరవుతారని రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా ఆర్థిక మంత్రి దివ్యాంగులను వృద్ధులతో కలపడం గురించి కేవలం సూచన చేశారు.

 ”కేరింగ్‌ ఇండియా” పథకంపై ఆర్థిక మంత్రి అనర్గళంగా మాట్లాడిన మంత్రి దివ్యాంగుల సంక్షేమానికి  నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. యాక్సెస్‌ ఇండియా పథకం ప్రచారానికే తప్ప నిధులకు నోచుకోలేదు. రాష్ట్రపతి ప్రసంగంలో ”దివ్యాంగన్  ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం చాలా సున్నితత్వంతో పనిచేస్తోంది” అన్నారు. కాని కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా బడ్జెట్‌ కేటాయింపులే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

2016లో చట్టం చేసిన ప్రభుత్వమే నిధులు కేటాయింపులు చేయకపోవడం నిర్లక్షానికి నిదర్శనం. దివ్యాంగుల సాధికారత శాఖకు బడ్జెట్‌లో 5శాతం నిధుల కేటాయించాల్సి ఉండగా కేవలం రూ.225 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌ పరికరాల కొనుగోలు కోసం, వైకల్యం పెన్షన్‌ పెంచే ప్రకటనలు లేవు. మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2017 ప్రకారం చేసిన ఆత్మహత్యలు, మానసిక ఆరోగ్య సమస్యల సంఖ్య భయంకరంగా పెరగడాన్ని ప్రభుత్వం విస్మరించింది.

కేంద్ర సంస్థలకు నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌, బెంగళూరు, లోజ్ప్రియా గోపీనాథ్‌ బోర్డోలి రీజినల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌, తేజ్పూర్‌లకు గతం కన్న కేటాయింపులు తగ్గించారు. ప్రభుత్వ రంగంలో ఉపాధి మార్గాలు తగ్గిపోవడం నిరుద్యోగ దివ్యాంగుల ఉపాధి చూపించేందుకు ఎలాంటి ప్రతిపాదనలు చేపట్టలేదని విమర్శించారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాధర్ చారి కార్యదర్శి సాయిరాం జిల్లా నాయకులు సంగప్ప షేక్ కాజా మియా నర్సా బోయి సావిత్రి గంగమ్మ గంగాధర్ జైపాల్ నాయక్ శివాజీ కాశీనాథ్ యశ్వంత్ నాయక్ రవి గంగా బోయి గోనె లక్ష్మి దిలీప్ సైలాని గంగాబోయి లక్ష్మణ్ రమేష్ రాములు లతో పాటు వివిధ మండలాల నుండి దివ్యాంగులు పాల్గొన్నారు.

Related posts

గేట్-2022 లో ర్యాంకు విద్యార్థులకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు

Satyam NEWS

జగన్ సభలో వృద్ధురాలి కాలు నుజ్జునుజ్జు

Bhavani

2వేల 500 మంది సిబ్బంది తో ఎన్నికల బందోబస్తు

Satyam NEWS

Leave a Comment