30.7 C
Hyderabad
April 29, 2024 06: 50 AM
Slider ప్రపంచం

భారత్ లో కరోనా కట్టడికి సాయం అందిస్తున్న అమెరికా

#Dr Anthony Fauci

భారత్ లో పెరిగిపోతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు అమెరికా తన వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది.

రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులతో దేశ ఆరోగ్య రంగం ఇప్పటికే కుదేలైపోయింది. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేక ఆక్సిజన్ కొరతతో దేశం మొత్తం అల్లాడుతున్న విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో తమ వంతు సాయం అందించేందుకు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ భారత్ లోని సంస్థలకు సలహాలు ఇస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య సలహాదారుడు డాక్టర్ ఆంథోనీ ఫ్యూసీ తెలిపారు.

భారత్ లో కనిపిస్తున్న కరోనా వేరియంట్స్ పై విశ్లేషణలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం కరోనా వేరియంట్స్ ను అదుపు చేసేందుకు ఎంత వరకు ఉపకరిస్తుందో కూడా విశ్లేషణలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.

Related posts

కరోనా ఎలర్ట్: విద్యార్థులకు కరోనా వైద్య పరీక్షలు

Satyam NEWS

ఎన్నికల ప్రణాళిక భగవద్గీత.. బైబిల్.. ఖురాన్ అన్నారు కదా….?

Satyam NEWS

సీరియల్ కంటిన్యూస్: ఏపికి తదుపరి సిఎస్ ఎవరు?

Satyam NEWS

Leave a Comment