30.7 C
Hyderabad
May 5, 2024 05: 40 AM
Slider నల్గొండ

మీడియా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి

#jour

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో మీడియాకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని టియుడబ్ల్యూజే,ఐజేయు జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా టీయూడబ్ల్యూజేఐజేయు అద్యక్షుడు కోలా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇండియాలో ప్రభుత్వం మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

దేశంలో జర్నలిస్టులకు రైల్వే పాస్ లు పునరుద్ధరించాలని అన్నారు. హైదరాబాద్ తో సహా రాష్ట్రం లోని అన్ని జిల్లా నియోజకవర్గ,మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్లు,స్థలాలు మంజూరు చేయాలని అన్నారు.హెల్త్ కార్డులు,అక్రిడేషన్లు వెంటనే అందించాలని, ప్రైవేటు పాఠశాలలు,కళాశాలలో,  జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం సబ్సిడీ అందించాలని,హెల్త్ కార్డులు కార్పొరేట్ వైద్యశాలలో సక్రమంగా అమలు చేయాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నేతలు దేనుమకొండ శేషం రాజు, దేవరం రామిరెడ్డి,బసవోజు శ్రీనివాసాచారి, గీత రామనాథం,ఇట్టిమల్ల రామకృష్ణ, బాచిమంచి చంద్రశేఖర్,చిట్టిపోతుల రమేష్ బాబు,కొమరాజు అంజయ్య,బండి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

నవంబరు 5 నుండి 7 వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

Satyam NEWS

ట్యాక్స్ పేయర్స్ పై కరుణ చూపిన ఆదాయపు పన్ను శాఖ

Satyam NEWS

చంద్ర‌బాబుపై జ‌రిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

Satyam NEWS

Leave a Comment