39.2 C
Hyderabad
April 28, 2024 13: 26 PM
Slider ముఖ్యంశాలు

మోడీ వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ లో కలవరం ఎందుకు

#laxman

అభివుద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని మోడీ వస్తే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు కలవర పడుతున్నాయని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ ప్రశ్నించారు. నిజామాబాదులో రేపు ప్రధాని మోడీ పర్యటన సందర్బంగా నిజామాబాద్ వెళ్తూ కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా డా. లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఓటు, అధికారంతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. ఈశాన్య రాష్ట్రాలను దాదాపు 50 సార్లు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్లారని, అక్కడి ప్రజలు మోడీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో రైల్వే, ఎయిర్ వే, లాంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తున్నాయని తెలిపారు.

తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలో లేకున్నా 9లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసిందని, 4400 కోట్ల రూపాయలతో ఇటీవల అభివృద్ధి పనులకు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. రామగుండం ఎరువుల అభివృద్ధి కర్మాగారాన్ని పున ప్రారంభించి అభివుద్ధికి బాటలు వేశారన్నారు. రామగుండం పునః అభివృద్ధి పేరిట బీఆర్ఎస్ నాయకులు లక్ష కోట్లు దోచుకున్నారని, ఉద్యోగాల పేరిట యువకులను మోసం చేస్తే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 752 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో అంతజాతీయ విమానాశ్రయాన్ని తలపించేలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టారన్నారు. దేశవ్యాప్తంగా 34 వందేభారత్ రైళ్లను కేటాయిస్తే ఒక్క తెలంగాణకే 3 వందే భారత్ రైల్వేలను కేటాయించారని గుర్తుచేశారు. లక్ష కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల అభివృద్ధితో జాతీయ స్థాయిలో 2వ స్థానంలో తెలంగాణ జాతీయ రైల్వేలు ఉన్నాయని పేర్కొన్నారు.

13500 కోట్ల రూపాయలతో పాలమూరు ప్రాంతంలో అభివ్రుద్ధికి కేటాయించిన సంగతి తెలిసిందేనని, పాలమూరు సభకు మోడీ వస్తే కళ్ళు బైర్లు కమ్మి కేటీఆర్, రేవంత్ రెడ్డి మోడీపై అవాకులు, చెవాకులు పేలారన్నారు. ప్రధాన మంత్రి రాష్టానికి వస్తె ముఖ్యమంత్రి ముఖం చాటేస్తున్నారన్నారు. ప్రధాన మంత్రిని కేటీఆర్ విమర్శించడం బాధాకరమన్నారు. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు ఉమ్మడి నిజామబాద్ జిల్లా రైతులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా గిరిజనుల కోసం ములుగులో సమ్మక్క సారక్క పేరిట యునివర్సిటీ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరిజన యూనివర్సటీ ఏర్పాటు పట్ల రాష్ట్ర ప్రభుత్వం కనీసం హర్షం వ్యక్తం చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో గ్యారంటీ లేని పార్టీ అని, వ్యారెంటి ఇస్తే జనాలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఈ పథకాలు చేపట్టడం లేదని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ఒకే రకమైన విమర్శలు చేస్తున్నారని, ఇద్దరిది ఒకటే స్క్రిప్ట్ అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రధాని మోడీ వచ్చి అభివృద్ధి చేస్తే, ప్రజా ప్రవాహాన్ని చూస్తే రేవంత్ రెడ్డికి నిరాశ, నిస్పృహ ఉండటం సహజమేనన్నారు. మోడీ చెప్పినట్టు ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు ఒక్కటేనని, కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వెళ్తుందని, బీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు వెళ్తుందన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ తాపత్రయ పడుతుందని, అధికారంలోకి రావాలని కాదన్నారు. మొన్న జరిగిన పార్లమెంటులో బీఆర్ఎస్, కాంగ్రెస్ చట్టా పట్టాలు వేసుకొని నిరసనలు చేశాయని గుర్తు చేశారు. లిక్కర్ స్కాంలో ఉన్న కవిత ప్రధాని మోడీని విమర్శిస్తూ సోనియా గాంధీని పొగిడారన్నారు. టిఆర్ఎస్  కాస్త బీఆర్ఎస్ గా మారింది కానీ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని విమర్శించారు.

నిన్న పాలమూరులో జరిగిన సభ ట్రెయిలర్ మాత్రమమేనని, అసలు సినిమా ముందుందన్నారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకుందని, రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును ఎంఐఎం చించి వేస్తే బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు. 370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం, ట్రిబుల్ తలాక్ లాంటి అనేక చట్టాలు మోడీ చిత్త శుద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణ లో కాషాయ జండ ఎగరడం ఖాయమని, రేపటి మోడీ సభకు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Related posts

విశాఖ,ఏలూరు రేంజ్ ప‌రిధిల‌లో ఆరుగురు సీఐల‌కు బ‌దిలీలు…!

Satyam NEWS

సూర్యలంక తీరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

డివైన్ పవర్: రేపటితో ముగియనున్న అధ్యయనోత్సవాలు

Satyam NEWS

Leave a Comment