31.7 C
Hyderabad
May 2, 2024 09: 24 AM
Slider ముఖ్యంశాలు

ట్యాక్స్ పేయర్స్ పై కరుణ చూపిన ఆదాయపు పన్ను శాఖ

thZ7AZHH9A

కోర్టు కేసులను తగ్గించుకొనేందుకు ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన చర్య లలో భాగం గా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆదాయపు పన్ను విభాగం సుప్రీం కోర్టు, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు, తెలంగాణ హై కోర్టు లతో పాటు ఇన్ కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యూనల్ (ఐటిఎటి)లలో దాఖలై ఉన్న 969 అప్పీళ్ల ను ఉపసంహరించుకొంది. పన్ను చెల్లింపుదారుల పట్ల స్నేహపూర్వక వైఖరి తో మెలగేందుకు ఈ చర్యను చేపట్టినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కం ట్యాక్స్ కార్యాలయం తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ (సిబిడిటి) ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ న జారీ చేసిన సర్క్యులర్ కు అనుగుణం గా,  50 లక్షల రూపాయల కన్నా తక్కువ పన్ను ప్రభావం కలిగిన కేసుల ను ఇన్ కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యూనల్ లోను, ఒక కోటి రూపాయల కన్నా తక్కువ పన్ను ప్రభావం కలిగిన కేసుల ను హై కోర్టు లోను, రెండు కోట్ల రూపాయల కన్నా తక్కువ పన్ను ప్రభావం కలిగిన కేసుల ను సుప్రీం కోర్టు లోను సవాలు చేయబోమని ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది. 35 కోట్ల రూపాయల పన్ను ప్రభావం కలిగివున్న 87 కేసులను ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు నుండి, 219 కోట్ల రూపాయల పన్ను ప్రభావం కలిగివున్న 452 కేసులను తెలంగాణ హై కోర్టు నుండి,  119 కోట్ల రూపాయల పన్ను ప్రభావం కలిగివున్న 407 కేసులను ఇన్ కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యూనల్ నుండి, 29 కోట్ల రూపాయల పన్ను ప్రభావం కలిగివున్న 23 కేసులను సుప్రీం కోర్టు వద్ద నుండి ఆదాయపు పన్ను విభాగం ఉపసంహరించుకొంది.  అంటే మొత్తం 403 కోట్ల రూపాయల పన్ను ప్రభావం కలిగివున్న 969 కేసులను వాపసు తీసుకొన్నట్లు అవుతుంది. ఆదాయపు పన్ను విభాగం 2018-19 ఆర్థిక సంవత్సరం లో సైతం 892 కేసులను వాపసు తీసుకుంది. వీటి లో సుప్రీం కోర్టు వద్ద నుండి 33 కేసులను, హై కోర్టు పరిశీలన లో ఉన్న అప్పీళ్ల లో నుండి 441 అప్పీళ్ల ను, ఐటిఎటి పరిశీలనలో ఉన్న అప్పీళ్ల లో నుండి 418 అప్పీళ్ల ను ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంటు ఉపసంహరించుకున్నది.

Related posts

2 అడుగుల స్థ‌ల వివాదంలో పోలీసు పంచాయితీ

Satyam NEWS

ఫ్రేమోన్మాధి ఘాతుకం

Murali Krishna

కడప జిల్లాలో నేటి నుంచి ఆపరేషన్ ముస్కాన్

Satyam NEWS

Leave a Comment