Slider నిజామాబాద్

సంక్షేమ హాస్టళ్లలో పెరగని మెస్,కాస్మోటిక్ చార్జీలు

#messcharges

నిత్యావసర వస్తువుల ధరలు మార్కెట్ లో భగభగమండుతున్నాయి. వంటింటి బడ్జెట్ పూర్తిగా మారిపోయింది. లాక్ డౌన్ తరువాత గతంలో కన్నా మూడు రెట్ల మేరకు సరుకుల ధరలు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహలలో మాత్రం 2016 నాటి మెస్, కాస్మోటిక్ చార్జీలు మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసమని కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి, ఏ.ఐ.ఎస్.బీ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రోజుకి ఒకో విద్యార్థికి రూ.33 రూ.లు కేటాయిస్తున్నారని, ఈ రోజులలో ఈ డబ్బులతో ఉదయం పూట అల్పాహారం కూడా రాని పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. ఎదిగే పిల్లలకు అవసరమైన ఆహారం అందించకపోతే వారు భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసుకోవచ్చని ఉద్యమ సమయంలో, అసెంబ్లీలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ హామీ నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు.

జైల్లో ఖైదీలకిచ్చే వసతుల కన్నా అధ్వానంగా ఉన్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికీ 8 సంవత్సరాలు గడుస్తున్న వసతి గృహలలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నది అని ఆయన అన్నారు. ప్రస్తుతం 3వ తరగతి నుండి 7వ తరగతి విద్యార్థులకూ మెస్ చార్జీలు 950 రూ.లు కాస్మోటిక్ చార్జీలు 55 రూ.లు…8,9,10 వ తరగతి విద్యార్థులకూ మెస్ చార్జీలు 1100 రూ.లు కాస్మోటిక్ చార్జీలు 75 రూ.లు…ఇంటర్ ఆపై ఉన్నత చదువు విద్యార్థులకూ మెస్ చార్జీలు 1500 రూ.లు ఇస్తున్నారు.

కానీ ఈ మెస్,కాస్మోటిక్ చార్జీలు విద్యార్థులకూ ఏ మాత్రం సరిపోకపోవడం వల్ల పౌష్టిక ఆహారం సరిగా అందక విద్యార్థులు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా ఇచ్చే మెస్ చార్జీలను 3.వ తరగతి నుండి 7.వ తరగతి 950 నుంచి 3000 కూ కాస్మోటిక్ ఛార్జిలను 55 నుంచి 500 వరకు…8,9,10 వ తరగతి విద్యార్థులకూ మెస్ చార్జీలను 1100 నుంచి 3500 కూ కాస్మోటిక్ చార్జీలను 75 నుంచి 600 వరకు…ఇంటర్ ఆపై విద్యార్థులకూ మెస్ ఛార్జిలను 1500 నుంచి 3500 లకు పెంచాలి ప్యాకెట్ మనీ కోసం 1000 రూ.లు ఇవ్వాలనీ ఆయన రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేశారు.

జి.లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

వివేకా హత్య కేసు విచారణలో ఏమిటీ దాగుడుమూతలు?

Satyam NEWS

శ్రీశైలం గోశాల బాధ్యతల నుంచి రజాక్ భార్యకు ఉద్వాసన

Satyam NEWS

తక్షణమే వైస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలి

Satyam NEWS

Leave a Comment