32.7 C
Hyderabad
April 27, 2024 01: 51 AM
Slider ప్రత్యేకం

శ్రీశైలం గోశాల బాధ్యతల నుంచి రజాక్ భార్యకు ఉద్వాసన

#RajasinghMLA

శ్రీశైలం దేవస్థానంలో ముస్లిం మతస్థుల పెత్తనం పై హైదరాబాద్ ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన పోరాటం ఫలించింది.

శ్రీశైలం దేవస్థానం నిర్వహించే గోశాల నిర్వహణ బాధ్యతల నుంచి అక్కడ పెత్తనం చెలాయిస్తున్న రజాక్ భార్యను తొలగించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీశైలం దేవస్థానంలో జరుగుతున్న అవకతవకలను తెలంగాణ కు చెందిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ లేవనెత్తడం, ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ బిజెపి కనీసం సంఘీభావ ప్రకటన కూడా చేయకపోవడం తదితర అంశాలపై సత్యంన్యూస్ ప్రత్యేక వ్యాసం పోస్టు చేసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎలాంటి స్పందన వెలువరించకపోయినా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ స్పందించింది. అక్కడి కార్యనిర్వహణాధికారి గోశాల నిర్వహణ బాధ్యతల నుంచి రజాక్ భార్యను తప్పించారు.

ఈ విషయాన్ని రాజాసింగ్ వెల్లడించారు. శ్రీశైలం దేవస్థానంలో ముస్లింల పెత్తనం అరికట్టేందుకు అక్కడ ఒక టాస్క్ ఫోర్సును నియమించాలని రాజాసింగ్ సూచించారు. దేవస్థానంలో గో మాసం అమ్మడం తదితర కార్యక్రమాలను పూర్తిగా అరికట్టేందుకు దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Related posts

తెలంగాణ లో విద్యాలయాలకు సెలవులు పొడిగింపు

Satyam NEWS

‘క్షీర సాగర మథనం’ పాటకు పట్టాభిషేకం!!

Satyam NEWS

కాంబోజి లక్ష్మీదేవి మరణించినా ఆమె కళ్ళు ప్రపంచాన్ని చూస్తాయి

Satyam NEWS

Leave a Comment