40.2 C
Hyderabad
May 5, 2024 17: 41 PM
Slider ఖమ్మం

మిల్లర్లు అధికారులతో సమన్వయo చేసుకోవాలి

#Millers FCI

జిల్లాలో మిల్లర్లు ఎఫ్.సి.ఐ. అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన సీఎంఆర్ రైస్ డెలీవరి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో సీఎంఆర్ రైస్ డెలివరీపై అధికారులు, రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేర నిర్వహించి, రైస్ ఉత్పత్తిలో వేగం పెంచి లక్ష్యం మేరకు సి.ఎం.ఆర్. రైస్ డెలివరీ చేయాలనీ అన్నారు. ఖరీఫ్, రబీ 2022-23 పంటకు సంబంధించిన పెండింగ్ ఉన్న సిఎంఆర్ రైస్ డెలీవరి దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. 2022-23 ఖరీఫ్ రైస్ డెలీవరి సంబంధించి 60.1 శాతం, రబీకి సంబంధించి 1.3 శాతం డెలివరీ జరిగిందని ఆయన తెలిపారు.

రైస్ మిల్లర్లు నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రైస్ డెలీవరి చేయాలని ఆయన అన్నారు. ఎఫ్.సి.ఐ. గోదాం వద్ద అధిక సమయం వాహనాలు వేచి చూడకుండా త్వరితగతిన గోదాం స్పేస్ చూపించాలని, హామాలీల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారిణి పద్మజ, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సోములు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు బొమ్మ రాజేశ్వరరావు, అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

Related posts

పట్టణాలకు దీటుగా మండలం అభివృద్ధి

Bhavani

గుజరాత్ లో ఒక్క అవకాశం ఇవ్వండి: కేజ్రీవాల్

Satyam NEWS

విజయనగరం జిల్లాను వ‌దిలి వెళుతున్న ధీర‌ వ‌నిత‌

Satyam NEWS

Leave a Comment