30.7 C
Hyderabad
May 12, 2024 23: 22 PM
Slider ప్రత్యేకం

తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన పోలీసులకు మంత్రి కేటీఆర్ అభినందన

#ministerktr

రెండు రోజుల కింద తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య ను మంత్రి కే. తారకరామారావు అభినందించారు. రాంగ్ రూట్ లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకుని మరి అభినందనలు తెలిపారు.

సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా….నిబంధనలు అందరికీ ఒకటే అని, ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.  ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో  తాను ఎల్లవేళలా ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజు సైతం వాహనంలో తాను లేనని కేటీఆర్ అన్నారు.

అయితే బాపు ఘాట్ లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్ లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్ లకు శాలువా కప్పి అభినందించిన మంత్రి,  విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకి ఎప్పుడూ తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.

మంత్రి కేటీఆర్ తన వాహనానికి విధించిన చలాన్ ను సైతం చెల్లించారు. ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తలు నాయకులకు సరైన సందేశం అందేందుకు ఈరోజు ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన విషయాన్ని,  పార్టీ శ్రేణులు గుర్తించాలని కేటీఆర్ అన్నారు

Related posts

ఇన్ స్పెక్షన్: ప్రజలు బాగానే సహకరిస్తున్నారు

Satyam NEWS

(Sale) – Cipla Medicine For High Blood Pressure Traditional Chinese Medicine Herbs For High Blood Pressure Pink Oval Blood Pressure Pills 50 Mg

Bhavani

ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

Bhavani

Leave a Comment