38.2 C
Hyderabad
April 28, 2024 19: 20 PM
Slider ప్రత్యేకం

ఓ విక‌లాంగురాలు…ఓ చ‌దువుకున్న లేడీ..ఓ చ‌దువులేని మ‌హిళ‌…!

#vijayanagaramsp

పోలీస్ అంటే బాధితుల క‌ష్టాలు తీరుస్తారు…! ఖాకీ యూనీఫాం వేసుకున్న వారే పోలీసులు….వారి వ‌ద్ద‌కు వెళితే…బాదితుల‌కుకొండంత ధైర్యం. ప్ర‌జ‌ల‌ల‌లో ఆ రక‌మైన ధైర్యం…వాళ్ల‌ల్లో నింపేందుకు…క‌లిగించేందుకు పోలీస్ శాఖ ఎన్నోకార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. అందులోభాగ‌మే ప్ర‌తీసోమ‌వారం నిర్వ‌హించే స్పంద‌న కార్య‌క్ర‌మం.

స్థానిక పోలీస్  స్టేష‌న్ లో  ప‌రిష్కారం కాని…స్థానిక సిబ్బంది వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో స్టేష‌న్ కు  వెళ్లే  బాధితుల‌కు వ‌స్తున్న స‌మ‌స్య‌ల‌ను క‌ళ్లారా పోలీస్ బాస్ లు నిర్వ‌హించేదే స్పంద‌న కార్య‌క్ర‌మం. ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  ప్ర‌తీ సోమ‌వారం మాదిరిగానే జిల్లా పోలీస్ కార్యాల‌యంలో స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది..పోలీస్ శాఖ‌.

అంటే బాధితుల నుంచీ  వారి వారి స‌మస్య‌ల‌ను ఫిర్యాదుల రూపంలో తీసుకుని….వారిముందే  వారి బాథ‌ల‌ను సావ‌ధానంగా చూసి విని…అక్క‌డిక్క‌డే వీలైతే ఫోన్ లోనే మాట్లాడి…స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే కార్య‌క్ర‌మ‌మే స్పంద‌న‌. జిల్లాకు దాదాపు నాలుగు నెల‌ల క్రితం ఎస్పీ గా వ‌చ్చిన దీపికా ఎం.పాటిల్…శాఖా ప‌రంగాస్టేష‌న్ ల‌ను ఆకస్మికంగా త‌నిఖీ చేయ‌డంతో పాటు వారానికి ఒక‌సారి జ‌రిగే స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని విధిగా నిర్వ‌హిస్తు ఉన్నారు.

ఆ  క్ర‌మంలోనే  డీపీఓ లో స్పంద‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది.ఈస్పంద‌న‌లో ఓ దివ్యాంగురాలు…ఓ చ‌దువుకున్న లేడీ…అలాగే చ‌దువుకోలేని మ‌హిళ‌…ఇలా ఎందరో అభాగ్యుల…బాధితురాళ్లు,బ‌య‌ట‌కు చెప్పుకోలేక‌.. త‌మ‌, త‌మ‌ స‌మ‌స్య‌ల‌ను  లేడీ పోలీస్ బాస్…చెప్పుకుని ప‌రిష్కారం కోరారు. 

వాళ్లంతా  అనుభ‌విస్తున్న బాధ‌ల‌ను..క‌ళ్ల‌వెంబ‌డి క‌న్నీరు కార్చుతూ…చెబుతున్న వైనం అది క‌ళ్లారా చూస్తున్న ఎస్పీ,ఏఎస్పీకి గుండెలు కరిగిపోయి…ఒక్క క్ష‌ణం ఉండిపోయారు.త‌క్ష‌ణ‌మే ఆ క్ష‌ణం నుంచీ తేరుకుని.. బాధితుల‌ను..త‌క్ష‌ణ ప‌రిష్కారం కోసం..దిశ పోలీస్ స్టేష‌న్ కు వెళ్ల‌మ‌ని చెప్పి…ఆ వంట‌నే సంబంధిత విభాగం చూస్తున్న డీఎస్పీని చూడ‌మ‌ని  ఆదేశాలు ఇచ్చారు.

బాధితుల‌ సమస్యలను అడిగి తెలుసుకొని, సంబధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ఎన్.సూర్యచంద్ర రావు, డిసీఆర్బీ సిఐ బి.వెంకటరావు, ఎస్బి సిఐలు  జి.రాంబాబు,  ఎన్.శ్రీనివాసరావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరికి అస్వస్థత

Satyam NEWS

సిలిండర్‌ పేలి ఐదుగురు పిల్లలు దుర్మరణం

Sub Editor

గాంధీజీ కలలుగన్న రాజ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి

Satyam NEWS

Leave a Comment