39.2 C
Hyderabad
May 4, 2024 20: 14 PM
Slider ప్రత్యేకం

విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన మంత్రి కేటీఆర్

#ministerktr

మంత్రి కేటీఆర్ 12 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని గత రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ఈ నెల 18న లండన్ వెళ్లిన ఆయన బ్రిటన్, భారత్ వాణిజ్య మండలి రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించారు. భారత రాయబారి ఏర్పాటు చేసిన వాణిజ్యవేత్తలు, ప్రవాసుల భేటీలోనూ పాల్గొన్నారు. దావోస్ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు 22న లండన్ నుంచి బయలుదేరి స్విట్జర్లాండ్ చేరుకున్నారు.

23న దావోస్‌ సదస్సుకు హాజరయ్యారు. 28 వరకు జరిగిన ఈ సదస్సులో భాగంగా కేటీఆర్ తెలంగాణ పెవిలియన్‌లో 45 మంది పారిశ్రామికవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దాదాపు రూ. 4,200 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి సాధించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ ప్రభుత్వ విధానాలతోపాటు, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని అన్నారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Related posts

పసుపు రైతులకు పాచిపోయిన అన్నం పెట్టిన బిజెపి

Satyam NEWS

తల్లీ కొడుకులకు కరోనా సోకిందని… ఇంటి యజమాని…..

Satyam NEWS

కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment