28.7 C
Hyderabad
May 5, 2024 09: 45 AM
Slider హైదరాబాద్

లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చేయాలి

#MLA Kaleru

లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు వెళ్లకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించ వలసిందిగా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధికారులకు అదేశించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి మొయిన్ చెరువు నుంచి ఎస్ టి పీ వరకు గల నాల, నాలా ప్రాజెక్టు గురించి అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలా పరివాహక ప్రాంతం ప్రజలు ముఖ్యంగా బాపు నగర్, సి బ్లాక్, పటేల్ నగర్, ప్రేమ్ నగర్ తదితర ప్రాంతాల లో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో, ఏక్కడ కూడా నీళ్ళు నిలువగుండా చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ఈ.ఈ శంకర్, డి.ఈ. సుధాకర్, నాలా ప్రాజెక్టు అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, లింగారావు, మహేష్ ముదిరాజ్, మహమ్మద్ గౌస్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

Related posts

వాట్సాప్ ద్వారా ఐఐటీ -జేఈఈ ఫోరమ్ బుక్ లెట్

Satyam NEWS

వనపర్తిలో కర్నూలు హెల్త్ కేర్ క్లినిక్ సీజ్

Satyam NEWS

చిత్ర పరిశ్రమకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న మహత్తర అవకాశం

Satyam NEWS

Leave a Comment