37.7 C
Hyderabad
May 4, 2024 12: 13 PM
Slider ముఖ్యంశాలు

ఆధునిక సాంకేతికతను వినియోగించు కోవాలి

#Chairman Allam Narayana

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూనే పాత్రికేయులు క్రియేవిటిని పెంపొందించుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో కొత్తగూడెం లోని సింగరేణి మహిళా కళాశాలలో నిర్వహిస్తున్న పాత్రికేయుల శిక్షణా తరగతులు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ ఛైర్మన్ గౌరీ శంకర్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు బుచ్చన్న, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు, సింగరేణి డైరెక్టర్ పా బలరాం, జియం ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పాత్రికేయులకు అన్ని అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.

రాతి యుగం నుండి నేటి యుగం వరకు సప్తసముద్రాలు దాటిన విషయాన్ని తెలుసుకునే సమయంలో కూడా పాత్రికేయులు ఎంతో సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారని చెప్పారు. వార్తల సేకరణలో పాత్రికేయులు వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలని చెప్పారు. సాంకేతిక అభివృద్ధి చెందిన నేపథ్యంలో పాత ఆలోచనలను మార్చుకుంటూనే కొత్త ఆలోచనలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు నిర్వహించిన పాత్రికేయుల శిక్షణా కార్యక్రమంతో మారుతున్న సమజాంలో పాత్రికేయుల పాత్ర తదితర అంశాలపై వక్తులు ఎన్నో విషయాలపై పాత్రికేయులకు సమగ్రమైన అవగాహన కల్పించారని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ముందుకు పోవాలంటే శిక్షణ చాలా అవసరమని చెప్పారు.

అన్యాయానికి గురైన బాధితులు పక్షాన న్యాయం జరిగే విధంగా వార్తలు వ్రాయాలని చెప్పారు. అనంతరం పాత్రికేయులకు శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్న సర్టిఫికేట్లు, వార్తల సేకరణపై తయారు చేసిన పుస్తకాలను అందచేశారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, మేనేజర్ వెంకటేశ్, పిఆర్ఓ వనజ, ఓఎన్డీ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సమగ్ర శిక్ష ఉద్యోగుల జాగరణ

Satyam NEWS

మాస్కులు ధరిద్దాం.. కరోనాను ఎదుర్కొందాం

Satyam NEWS

కుట్ర ఎవరు చేశారో వై ఎస్ షర్మిలే చెప్పాలి

Satyam NEWS

Leave a Comment