37.2 C
Hyderabad
April 30, 2024 12: 30 PM
Slider నిజామాబాద్

సమగ్ర శిక్ష ఉద్యోగుల జాగరణ

#samagra

కామారెడ్డిలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్షలు 17 వ రోజు కొనసాగాయి. నిరాహార దీక్షలో భాగంగా బుధవారం రాత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద టెంటులోనే జాగరణ చేపట్టారు. మహిళా ఉద్యోగులు సైతం జాగరణలో పాల్గొన్నారు. జాగరణ సందర్బంగా ఉద్యోగులు జానపద గేయాలలో తమ సమస్యలను చెప్పుకుంటూ పాటలు పాడుతూ కోలాటలు ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండును పట్టించుకోవాలని కోరారు. తమను విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించాలన్నారు. ఫుల్ టైం వర్క్ చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. తమ డిమాండ్స్ పరిష్కారం అయ్యేవరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు.

Related posts

ప్రదర్శనకు తిరుమల శ్రీవారి ఆభరణాలు

Satyam NEWS

సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణి

Satyam NEWS

గన్ను కన్నా ముందు జగన్ వస్తాడన్నారు… ఏడీ..రాలేదేం?

Satyam NEWS

Leave a Comment