33.2 C
Hyderabad
May 4, 2024 00: 27 AM
Slider ప్రపంచం

భారత్ చేతిలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బాంబర్?

#whiteswan

గత కొన్నేళ్లుగా చైనా నుంచి భారత్ తీవ్ర కవ్వింపు చర్యలు ఎదుర్కొంటున్నది. దానికి తగిన సమాధానం చెప్పేందుకు ఒక అడుగు వెనక్కు వేయాల్సిన పరిస్థితి ఉంది. చైనా వద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయి. వాటికి దీటై ఆయుధాలు భారతదేశానికి లేవు.

వీటిలో ఒకటి చైనా  H-6K వ్యూహాత్మక బాంబర్. గతేడాది చైనా ఈ బాంబర్‌ను భారత సరిహద్దుల్లో మోహరించింది. అప్పుడు భారత్‌కు ఏం చేయాలో పాలుపో లేదు. ఇప్పుడు చైనా వద్ద ఉన్న H-6K వ్యూహాత్మక బాంబర్ కు సమాధానం భారత్ కు దొరికింది.

రష్యా నుంచి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యూహాత్మక బాంబర్ Tu-160ని భారత్ కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం. రష్యా నుంచి కనీసం ఆరు Tu-160 బాంబర్ విమానాలను కొనుగోలు చేసేందుకు చర్చలు చివరి దశలో ఉన్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

టీయూ-160 విమానం దాదాపు 52 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. అందువల్ల, రాడార్ కూడా ఈ విమానాన్ని పట్టుకోలేదు. ఈ విమానాలు దాదాపు 40 వేల కిలోల బరువున్న బాంబులను కూడా మోసుకెళ్లగలవు.

Related posts

కాకినాడలో పోలీసు అమర వీరులకు ఘన నివాళులు

Satyam NEWS

క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించండి

Satyam NEWS

విశాఖలో చంద్రబాబు పర్యటన కేసుల్లో 50 మంది అరెస్టు

Satyam NEWS

Leave a Comment