27.7 C
Hyderabad
May 4, 2024 10: 50 AM
Slider నల్గొండ

షాపుల ఎదుటే వంట వార్పు చేసి నమాజు తో నిరసన వ్యక్తం చేసిన ముస్లింలు

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన సెంటర్ లోని మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ పై వక్ఫ్ బోర్డు అధికారులు చూపిస్తున్న అలసత్వానికి వ్యతిరేకంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అతితక్కువ కిరాయి చెల్లిస్తూ అక్రమ పద్ధతిలో ఉంటున్న లీజుదారులు కారణంగా మసీదుకు రావాల్సిన ఆదాయం కోల్పోతున్నామని వారు అంటున్నారు.

గడువు ముగిసి సుమారు10 సంవత్సరాలు అయినప్పటికీ వక్ఫ్ బోర్డు అధికారులు ఆ షాపు యజమానులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ముస్లింలు అన్నారు. మార్కెట్లో ఈ స్థాయి దుకాణాలకు ఇరవై వేల నుండి ఇరవై అయిదు వేల వరకు కిరాయి ఉన్నప్పటికీ దుకాణదారులు కేవలం నామమాత్రపు అద్దెను మాత్రమే మజీద్ కమిటీకి చెల్లిస్తున్నారని వారు తెలిపారు.

నామమాత్రపు అద్దె తీసుకుంటున్న మజీద్ కమిటీ అక్రమంగా వేల రూపాయలు ఆర్జిస్తున్నారని వారు ఆరోపించారు. షాపులను తక్కువ కిరాయికి ఇవ్వటం వలన మసీదు అభివృద్ధి జరగకపోవటంతో పాటు సిబ్బంది జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 12 నెలలుగా సిబ్బందికి జీతాలు రావడంలేదని వారన్నారు.

ఈ విషయంలో గతంలో సంబంధిత వక్స్ బోర్డు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ విచారణకు వచ్చిన అధికారులు నేటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. లీజు గడువు ముగిసినా షాపింగ్ కాంప్లెక్స్ షాపులకు వెంటనే వక్ఫ్ బోర్డు, సంబంధిత ప్రభుత్వ అధికారులు వెంటనే బహిరంగ వేలం వేసి అర్హులైన ముస్లిం సోదరులకు ఇవ్వాలని,మార్కెట్ లో ఉన్న అద్దెల ప్రకారం కొత్తవారికి అవకాశం కల్పించాలని,స్థానిక ముస్లిం మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మైనార్టీ నాయకులు ఎండీ.అజీజ్ పాషా,ఎంఏ అబ్దుల్ రహీమ్,సయ్యద్ మున్న, షేక్.మన్సూర్ అలీ, పఠాన్ గౌస్, ఖాన్,ఎండి.రహీం, బిక్కన్ సాహెబ్, సలావుద్దీన్, సిరాజ్, జానీ, మౌలాలి, మీరా, ఖాదర్, సద్దాం,గౌస్,ఖజా,ముస్తఫా, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వచ్చే నెల నుంచి లబ్ధిదారుల ఇంటికే నేరుగా పెన్షన్లు :జగన్‌

Satyam NEWS

ఒంటరి మహిళ, వితంతువు పెన్షన్ పేర్లను తొలగించాలి

Satyam NEWS

నగర బాట సందర్భంగా జహీరాబాద్ లో మంత్రి హరీష్ సైకిల్ యాత్ర

Satyam NEWS

Leave a Comment