33.2 C
Hyderabad
May 3, 2024 23: 16 PM
Slider సినిమా

సిగ్గులేని సినీ పెద్దలకు గడ్డిపెట్టిన నాగబాబు

nagababu

సిగ్గు లేని సినిమా పెద్దలపై నాగబాబు ఘాటైన స్టేట్ మెంట్ ఇచ్చారు. సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ కు మద్దతు దక్కటం లేదంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ‘‘సినీ పరిశ్రమలో ఇలాంటి సమస్య ఎవరికి వచ్చినా కల్యాణ్ బాబు సహకరిస్తాడు… మీరేం బాధపడకండి…’’ అంటూ పవన్ కల్యాణ్ కు అడగా నిలబడని సినీ పెద్దలపై ఆయన సెటైర్ల వేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కల్యాణ్ పై పగబట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది తప్పు అని చెప్పేందుకు కూడా మొహం చాటేస్తున్నారని ఆయన అన్నారు. అయినా ఫర్వాలేని నాగబాబు చెబుతూ మీకు ఎవరికైనా కష్టం వస్తే మాత్రం పవన్ కల్యాణ్ ఇలా మొహం చాటేయడని అన్నారు. హీరో, నిర్మాత, దర్శకుడు ఇలా ఎవరికి సమస్య వచ్చినా ముందుంటామని నాగబాబు అన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది ఐదేళ్లే. ఈ అధికారం శాశ్వతం కాదు. ఆ తరువాత ప్రజాక్షేత్రంలో నిలబడాల్సిందేనని స్పష్టం చేసారు. మమ్మల్ని వదిలేసినా మా సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. భీమ్లానాయక్ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు నుంచే ఏపీ రెవిన్యూ అధికారులు థియేటర్లకు నోటీసులు ఇచ్చారు. బెనిఫిట్ షో నిర్వహణకు అనుమతి నిరాకరించారు.

దీంతో.. పవన్ అభిమానులు నిరసన వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారంటూ వైసీపీ పైన టీడీపీ – బీజేపీ నేతలు సైతం విమర్శలు చేసారు. ప్రభుత్వం నుంచి మాత్రం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తో షాక్ లో ఉన్నామని..దీని కారణంగానే జీవో జారీ ఆలస్యం అయిందని చెప్పారు.

మంత్రులు బొత్సా సత్యనారాయణ, పేర్ని నాని  లాంటి వారు సినిమాను వాయిదా వేసుకోవాల్సిదంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం భీమ్లానాయక్ అయిదో షో ప్రదర్శను రెండు వారాల పాటు అనుమతి ఇచ్చింది. దీంతో..తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు సహకరిస్తుంటే..ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

చిరంజీవి తో పాటుగా హీరోలు సీఎం జగన్ ను కలిసిన సమయంలో అయిదో షో ప్రదర్శనుకు సానుకూలంగా స్పందించారని సమావేశం అనంతరం హీరోలు చెప్పారు. కానీ, అధికారికంగా జీవో జారీ చేయకపోవటంతో ఇప్పటి వరకు పాత నిర్ణయాలే అమలు అవుతున్నాయి.

Related posts

ములుగు జిల్లా టీచర్ బదిలీలకు మార్గదర్శకాలు

Satyam NEWS

వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించిన వనపర్తి జిల్లా ఎస్పీ

Satyam NEWS

రైస్ మిల్ డ్రైవర్ల వేతనాలు, అలవెన్సులు పెంచాలి

Satyam NEWS

Leave a Comment