28.7 C
Hyderabad
April 27, 2024 05: 53 AM
Slider ముఖ్యంశాలు

యోగ పుట్టిన దేశంలో వ్యాయామం లేక యువత నిర్వీర్యం

#kolagatlashravani

తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు, క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఈ మేరకు నగరంలోని రాజీవ్  క్రీడా ప్రాంగణంలో శాప్  మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు మరియు ఫెన్సింగ్ క్రీడాపోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు పిల్లల ఎదుగుదలకు ప్రాణవాయువు లాంటిదన్నారు. ఆటలు పిల్లల్ని ఉత్సాహంగా ఉంచుతాయి అన్నారు.

వారిలో పోరాట స్పూర్తిని కలిగిస్తాయనీ అన్నారు. క్రీడలు మనిషికి ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి అన్నారు. యోగా పుట్టిన మన భారతదేశంలో భావితరం శారీరక వ్యాయామం లేక చదువుల చట్రం లో ఇరుక్కు పోతున్నారు అని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ క్రీడలకు, విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలకు కొత్త హంగులు, స్టేడియంలో అభివృద్ధికి సీఎం జగన్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పెద్దపీట వేశారని అన్నారు.

క్రీడలను జీవితంలో భాగం చేసుకున్న యువతకు వారి ప్రతిభ ఆధారంగా ప్రభుత్వ రంగంలో కానిస్టేబుల్ గా, సైనికులుగా, వ్యాయామ ఉపాధ్యాయుల గా ఎన్నో అవకాశాలు పొందవచ్చని అన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయిలో కొవ్వూరు లో, కర్నూల్ లో జరిగే పోటీలలో ప్రతిభను కనబరిచి విజయనగర ఖ్యాతిని ఇనుమడింప చేయాలన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ స్టేడియంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి  వెంకటేశ్వరావు, వాలీ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు భగవాన్ దాస్, కనకల కృష్ణ, కృష్ణంరాజు, ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రసాద్, అనిల్ కుమార్ శర్మ,  కోచ్ లు ,క్రీడాకారులు పాల్గొన్నారు.

Related posts

సైబరాబాద్ లో ఆపరేషన్ స్మైల్ VIII ప్రారంభం

Satyam NEWS

Twitter Blue: ఇక ట్విట్టర్ లో సేవలకు చార్జీలు

Satyam NEWS

ఒంటిమిట్టలో 7న శ్రీకోదండరాముని కల్యాణోత్సవం

Satyam NEWS

Leave a Comment