29.7 C
Hyderabad
April 29, 2024 08: 52 AM
Slider ఖమ్మం

సమ్మెకు సిద్ధం కండి

#CITU

అంగన్వాడి రంగంలో సిఐటియు, ఏఐటీయూసీ జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెకు సిద్ధం కావాలని అంగన్వాడి ఉద్యోగులకు పిలుపు ఇచ్చింది.సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఖమ్మం జిల్లా కార్యదర్శి సుధా రాధా అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సిహెచ్ సీతామహాలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడి సంఘాల ఒత్తిడి మేరకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగస్టు 18వ తేదీన ఐదు సంఘాలతో జాయింట్ సమావేశం ఏర్పాటు చేశారని ఈ సమావేశంలో కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చినా ఆగస్టు 25వ తేదీన ప్రభుత్వం నుండి వచ్చిన ప్రకటనతో రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురై అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు రిటైర్మెంట్

బెనిఫిట్ సంఘాలన్నీ టీచర్ కు పది లక్షలు ఆయాకు ఐదు లక్షలు అడిగారని కేవలం ఒక లక్ష రూపాయలు, 50,000 మాత్రమే ఇస్తామని ప్రకటించడం అంగన్వాడి ఉద్యోగులను అవమానపరచడమేనని అన్నారు. చెప్పి పిఆర్సి ఇస్తామని చెప్పి ఎటువంటి ప్రకటన ఇవ్వలేదని కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పి ఆర్ సి వలన అంగన్వాడీ ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని ఎక్కువ జీతం ఉన్నవారికి ఎక్కువ పెరుగుతుందని తక్కువ జీతం ఉన్నవారికి తక్కువగానే పెరుగుతుందని అన్నారు పెన్షన్ 10000 5000 అడిగితే ఆసరా పెన్షన్ ఇస్తామనటమేమిటని ప్రశ్నించారు.

ఐసిడిఎస్ స్కీమ్ నా శాశ్వత శాఖగా మార్చాలని, అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని, పని భారం తగ్గించాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 11వ తేదీ నుండి అంగన్వాడీ కేంద్రాలకు తాళం వేసి టీచర్లు ఆయాలు మినీ టీచర్లు అంతా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ సమ్మెలో ఇతర సంఘాలన్నీ కలిసి రావాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ, సిఐటియు శ్రామిక మహిళా కన్వీనర్ పిన్నింటి రమ్య ఏఐటీయూసీ అంగన్వాడి నాయకురాలు యు. పద్మ పాల్గొన్నారు.

Related posts

రిజైన్ స్కై బార్ పై ఎక్సయిజ్ పోలీసు పంజా

Satyam NEWS

పట్టుబడిన 10 పశువులు పదిలంగా ఉన్నాయి…!

Satyam NEWS

3వ తేదీ నిరసనలు జయప్రదం చేయాలని కరపత్రం

Satyam NEWS

Leave a Comment