28.7 C
Hyderabad
May 5, 2024 23: 27 PM
Slider విజయనగరం

విజయనగరం డీఎస్పీ ఆధ్వర్యంలో 17 చోట్ల తనిఖీలు…!

#police

మోటారు వాహన చట్టం నిబంధనలు అతిక్రమించిన 153 వాహనదారులకు ఈ- చలానాలు…!

జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఆదేశాలతో  విజయనగరం లో నాఖాబందీ చేపట్టినట్లుగా డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు. నేరాల నియంత్రణలో భాగంగా పట్టణంలో ఆకస్మికంగా 17చోట్ల తనిఖీలు చేపట్టామన్నారు. సాయంత్రం 4గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తనిఖీలు చేపట్టామని అన్నారు. ఈ తనిఖీల్లో వాహన పత్రాలు సక్రమంగా లేని 23 మోటారు సైకిళ్లు, ఒక ఆటోను సీజ్ చేశామన్నారు. అదే విధంగా మోటారు వాహన చట్టం నిబంధనలు అతిక్రమించిన 153 వాహనదారులకు ఈ చలనాలు విధించామన్నారు.

అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపైన 5 కేసులు, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపైన   3 కేసులు నమోదు చేశామన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక,  ఆదేశాలతో నాఖాబందీ చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తుల వేలి ముద్రలను తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టామన్నారు. ఈ తనిఖీల్లో వన్ టౌన్ సీఐ బి.వెంకటరావు, టూటౌన్ సీఐ విజయానంద్, సీసీఎస్ సీఐ బుచ్చిరాజు, 17మంది ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొని నగరంలో  అయ్యన్నపేట, దుప్పాడ, ఆర్ అండ్ బి జంక్షన్, కలెక్టరు ఆఫీసు, సింహాచలం మేడ, కోట జంక్షన్, జే.ఎన్.టి.యు. జంక్షన్, కొత్తపేట, రింగ్ రోడ్డు, విటి అగ్రహారం వంటి 17 ముఖ్య కూడళ్ళల్లో తనిఖీలు చేపట్టామని విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు.

Related posts

బోధన్ ఎమ్మెల్యే బిజెపిలోకి జెంప్?

Satyam NEWS

బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కమిటీలో ఓయ విద్యార్థి నేత

Satyam NEWS

పాతబస్తీ ఇక మా అడ్డా అవుతుంది: బండి సంజయ్

Satyam NEWS

Leave a Comment