టిఆర్ఎస్ కు చెందిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ బిజెపి నిజామాబాద్ ఎంపి అరవింద్ ధర్మపురితో కలవడం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మంత్రి వర్గ విస్తరణలో పదవి ఆశించి భంగపడిన షకీల్ పార్టీ మారబోతున్నారనే సంకేతాలు వెలువడ్డాయి. ముస్లిం వర్గానికి చెందిన ఎంఎల్ఏ బిజెపిలో చేరితే అది సంచలనమే అవుతుంది. షకీల్ ఈ రోజు నా నివాసంలో నన్ను కలవడం జరిగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, జిల్లా లో ఉన్న అనేక రాజకీయ విషయాలపై లోతైన చర్చ జరిగింది అంటూ ఎంపి అరవింద్ వెల్లడించారు. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ తర్వాత అసమ్మతి గొంతు వినిపించిన నాయకులు కేటీఆర్ జోక్యంతో మెత్తబడ్డారనుకుంటున్న తరుణంలో బోధన్ ఎమ్మెల్యే బిజెపి ఎంపిని కలవడం సంచలనం సృష్టిస్తున్నది. దీన్ని బట్టి టిఆర్ఎస్ లో అసమ్మతి చల్లారలేనట్లు కనిపిస్తున్నది.
previous post