40.2 C
Hyderabad
May 5, 2024 15: 16 PM
Slider ఆధ్యాత్మికం

శాస్త్రోక్తంగా ప్రారంభమైన నమ్మాళ్వారుల అధ్యయనోత్సవాలు

#hujurnagartemple

హుజూర్ నగర్ శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామచంద్ర స్వామి కోవెల

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కోవెలలో వార్షిక అధ్యయన ఉత్సవాలు శనివారం ఆగమ శాస్త్ర పద్దతిలో వైభవంగా ఆరంభమైనాయి.

వేకువ ఝామున స్వయంభు వేణుగోపాల స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చక ఆచార్యులు నిత్య విధి కైంకర్యాలను  నిర్వహించి,ఉత్సవ మూర్తులకు,పరమ భక్తాగ్రేసరుడైన నమ్మాళ్వార్లకు తిరుమంజనం నిర్వహించి,తీర్చి దిద్దారు.ఆలయ ప్రధాన మండపంలో ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలు, తులసి మాలలతో శ్రీ రామచంద్ర స్వామి వారిని దివ్య మనోహరంగా అలంకరించారు.అలంకార సేవ, ఆళ్వారుల సేవోత్సవాల ముందు అర్చక బృందం,ఋత్వికులు దివ్యప్రబంధ వేద పఠనం నిర్వహించారు.

నమ్మాళ్వార్ల అధ్యయనోత్సవాల విశిష్టతను ప్రధాన అధ్యాపకులు శ్రీమాన్ బద్రినారాయణా చార్యులు భక్తులకు వివరించారు.నమ్మాళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పఠనం శ్రావ్యంగా నిర్వహించి,మంగళ వాయిద్యాల నడుమ పల్లకి సేవ నేత్రపర్వంగా జరిపారు.భగవద్ రామానుజాచార్య  అవతరణ ఘట్టాలతో అధ్యయనోత్సవలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి,స్థానాచార్యులు శ్రీనివాసాచార్యులు,రామకృష్ణమా చార్యులు,అర్చకులు నరసింహాచార్యులు,రంగభట్టర్రా చార్యులు,భాస్కరాచార్యులు,మురళి కృష్ణమాచార్యులు,దేవాలయ ధర్మ కర్తల మండలి సభ్యులు రామిశెట్టి రాము, మేరిగ గురవయ్య,వెన్న పద్మ,కూరపాటి వెంకటేశ్వర్లు,లక్క వెంకన్న, నరసింహమూర్తి,మహిళలు పిచ్చమ్మ, భారతమ్మ,వంకాయలు పద్మ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు పకడ్బందిగా చేస్తున్న అధికారిపై బదిలీవేటు

Bhavani

అవ్వ తాతల పింఛన్లతో ఆటలోద్దు

Satyam NEWS

ముస్లిం సోదరుడి వివాహానికి ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘు చేయూత

Satyam NEWS

Leave a Comment