Slider రంగారెడ్డి

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషకాహార వారోత్సవాలు

#anganwadi

పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీలు అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్పేట హెచ్.బి కాలనీ డివిజన్, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి లు కోరారు.  జాతీయ పోషణ వారోత్సవాల సందర్భంగా మీర్పేట హెచ్.పీ కాలనీ డివిజన్ పరిధిలోని కైలాసగిరి అంగన్వాడి సెంటర్లో నిర్వహించిన సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వారు హాజరయ్యారు.

కార్యక్రమంలో పాల్గొన్న జర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డిలు  సామూహిక శ్రీమంతాలు చేశారు. ఈ సందర్భంగా కుటుంబంలోనీ పెద్దన్నగా తోబుట్టువులకు చేసిన భావన కలిగిందని ఆ భగవంతుడు వారిని చల్లగా చూసి  పండంటి  బిడ్డకు జన్మనివ్వాలని కార్పొరేటర్లు ఆకాంక్షించారు. అదేవిధంగా చిన్నపిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేశారు. గర్భవతులకు బాలింతలకు మంచి పోషక ఆహారం తీసుకోవాలని వారు సూచించారు.

ముఖ్యంగా బాలింతలు పిల్లలపై పోషక లోపం లేకుండా చూడాలని ప్రతివారం అంగన్వాడీ సెంటర్లో ఎత్తు, బరువు లాంటి పరీక్షలు నిర్వహించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఎలాంటి లోపం ఉన్నా వెంటనే అంగన్వాడి సెంటర్ ని సంప్రదించాలని కార్పొరేటర్లు తెలిపారు. అలాగే బిడ్డ పుట్టిన వెంటనే తల్లి మర్రిపాలు పట్టించాలని పిల్లలు ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించి గర్భిణీ మహిళలకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఆరోగ్య సమాచారాన్ని నిర్ణయించడంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీలది కీలకపాత్ర అని కార్పొరేటర్లు అన్నారు.

అనంతరం అంగన్వాడీ టీచర్లకు బతుకమ్మ పండగ ను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. సామూహిక శ్రీమంతాలు చేయడానికి ఆడపడుచులకు చీరలు పెట్టినందుకు కార్పొరేటర్l ప్రభుదాస్ కి  ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు జైశీల, అంగన్వాడీ టీచర్లు మాధవి, సరోజ, హేమలత, స్వరూప, దీప్తి, లావణ్య ,గర్భిణీ స్త్రీలు, స్థానిక మహిళలు కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

పిన్నికి గుండె పోటు వస్తే జగన్ వాలంటీర్లతో ఎందుకు ఉన్నాడు?

Satyam NEWS

A tribute: తల్లి తలపుల్లో…

Bhavani

క‌మ‌ల‌నాధులు ఒత్తిళ్లే..బ‌దిలీకి కార‌ణ‌మా..?

Satyam NEWS

Leave a Comment