26.7 C
Hyderabad
May 15, 2024 08: 38 AM
ప్రత్యేకం

రెబెల్ లీడర్: పసితనం నుంచే తలవంచని నేతాజీ

netajee 2

నేతాజీకి తిరుగుబాటు తత్వం ఎప్పుడు అబ్బింది? ఎప్పుడేమిటి? చిన్న నాటి నుంచే ఆయన అన్యాయాలను సహించేవారు కాదు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాల్యం నుంచే అన్యాయాలను ఎదిరించారు. 1897 జనవరి 23న నేతాజీ జన్మించారు. ప్రభావతి దేవి, జానకి నాథ్ బోస్ దంపతులకు కటక్ లో జన్మించిన సుభాష్ చంద్ర బోస్ భారత స్వాతంత్ర్య సమరవీరులలో అగ్రగణ్యుడు.

అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవలో తన ప్రాణాలను బలిదానం చేసిన మహానుభావుడు. ముగ్గురు అన్నల తర్వాతి వాడు కనుక గారాబంగా పెరిగినా, బాల్యం నుండి క్రమశిక్షణ, దేశ భక్తి, దైవ భక్తి సాటి మానవులకు సేవ చేయాలనే తపన ఆయనలో తీవ్రంగా కనిపించేవి. ఒక్కసారి చదివితే చాలు దేన్నైనా మర్చిపోయే వాడు కాదు. ఆయన ఏక సంతాగ్రాహి అన్నమాట.

అన్యాయం జరుగుతున్నదనిపిస్తే ఎవరికైనా ఎదురు తిరగడమే బాల్యం నుండి ఆయనకు అలవాటు. ఈ అరుదైన లక్షణమే ఆయనను అత్యున్నత శిఖరాలకు చేర్చిందనడంలో సందేహం లేదు. ఆయన ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్ లో చదివేవారు. అప్పటిలో జాతి వివక్ష తీవ్ర స్థాయిలో ఉండేది. భారతీయ విద్యార్ధుల్ని చులకన చేసి మాట్లాడేవారు. నేతాజీ ఇలాంటి సంఘటనలను ఎలా సహిస్తారు? సహించరు గాక సహించరు.

ఇలా చేసే ఆంగ్లేయ విద్యార్ధులను చితక బాదడం ఆయనకు అలవాటైపోయింది. సాటి విద్యార్ధులు ఫిర్యాదు చేస్తే ఉపాధ్యాయులకు ఆయన తల వంచకుండా సమాధానం చెప్పేవారు. ఏనాడూ తలదించే అలవాటును ఆయన చేసుకోలేదు. కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పుడు తనను అన్యాయంగా నిందించిన ప్రొఫెసర్ని నిలదీసి, కళాశాల బంద్ చేయించాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అదీ ఆయన పవర్.

అంతే కాదు. విద్యార్ధులందర్నీ కూడగట్టి చివరికి ఆ ప్రొఫెసర్ ను  కళాశాల నుండి వెలివేసే దాకా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. పండగకు కొత్త బట్టలు, మిఠాయి, వద్దు అని నేతాజీ చెప్పేవాడు. అందుకు బదులుగా ఆంగ్లేయులను ఎదిరించినందుకు నడి వీధిలో కొరడా దెబ్బల శిక్షను అనుభవిస్తున్న సుశీల్ కుమార్ అనే వ్యక్తిని చూపించమని అడిగాడు నేతాజీ. దాంతో నేతాజీ మేనమామకు వేరే దారిలేక అక్కడకు తీసుకెళ్లాడు.

సుశీల్ కుమార్ ను కొరడాతో ఆంగ్లేయులు కొడుతున్నప్పుడల్లా ఆవేశంతో ఊగిపోయాడు. నేతాజీ ప్రవర్తన చూసి, నేతాజీ ఆవేశం చూసి అతని మేనమామ అక్కడ నుంచి నేతాజీని బలవంతంగా ఇంటికి తీసుకువచ్చాడు. లేకపోతే ఆ వయసులోనే నేతాజీ బ్రిటీష్ వారిపై తిరుగుబాటు ప్రకటించేవాడేమో. బాల్యంలో తన నోట్ పుస్తకాలలో దేశ భక్తుల, విప్లవ విరుల ఫోటోలు అతికించుకుని వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుంటూ పదుగురికి చెప్పావాడు నేతాజీ.

ఆ నోట్ పుస్తకం చూసిన అతని తండ్రి స్నేహితుడు ఒకాయన భవిష్యత్తులో వీడు ఆంగ్లేయులకు కొరకరాని కొయ్య అవుతాడు అన్నాడుట! ఆయన ఆశీర్వాద బలమో ఏమో గానీ నేతాజీ అలానే అయ్యాడు. ఆంగ్లేయులకు చుక్కలు చూపించాడు. ఇంటర్ చదువుతున్నప్పుడు ‘స్వేచ్చా సేవ సంఘ్’ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసిన నేతాజీ, యువకులను కూడగట్టి సమాజ సేవ, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం వ్యాయామం, ధ్యానం, క్రీడలు, వివిధ అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చేవాడు.

మెట్రిక్యులేషన్, ఇంటర్, తర్వాత బిఏ అన్నింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ఐ.సి.ఎస్. లో అఖిల భారత స్థాయిలో నాలుగవ స్థానం పొందాడు. ఆ తర్వాత భారత్ తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీని కలిశాడు. కొంతకాలం కలకత్తా నేషనల్ కాలేజికి ప్రిన్సిపాల్ గా పని నేతాజీ పని చేశాడు. చిత్తరంజన్ దాస్ స్థాపించిన స్వయం సేవక దళంలో కార్యకర్తగా వున్నాడు. ‘బంగ్లార్ కధ’ ‘ఫార్వార్డ్’ అనే పత్రికలకు సంపాదకుడిగా కూడా నేతాజీ పని చేశాడు.

విప్లవ మార్గంలో పోరాటం చేస్తున్న ‘యుగాంతర్’ ‘అనుశీలన్’ అనే సంస్థలకు అభిప్రాయ భేదాలు వస్తే సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించాడు. కాలేజీకి వెళ్లేందుకు ఇంట్లో డబ్బులు ఇస్తే తను కాలేజికి నడచి వెళ్లి డబ్బులు మిగిల్చి వృద్ధులైన బిచ్చగాళ్ళకు దానం చేసే వాడట! కలకత్తా లో నవ వివేకానంద సమూహం అనే సంస్థ లో సభ్యుడైసామాజిక, ఆధ్యాత్మిక సేవ చేసేవాడు నేతాజీ.

శారీరక, మానసిక ఆరోగ్యం ఈ రెండూ సమన పాళ్ళలో వుండాలని నేతాజీ భావించేవాడు. ధ్యానం, ప్రకృతి ఒడిలో ఒంటరిగా గడపడం, వివేకానంద బోధనలను పఠించడం, చరిత్ర ను చదవడం ఆయనకు అభిరుచులుగా ఉండేవి. ఇంతటి మహోన్నత లక్షణాలు ఉన్నాయి కాబట్టే లక్షలాది మంది ఆయనను అనుసరించారు. ఇప్పటికీ కోట్లాది మంది హృదయాలలో గూడుకట్టుకుని నేతాజీ ఉన్నారు.

Related posts

తాత అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ

Satyam NEWS

జాతీయ సైన్స్ డే నాడు శార్వాణీ పాఠశాల‌లో విజయనగరం పోలీస్ బాస్

Satyam NEWS

ఎరువుల ధరల పెంపుపై సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన

Satyam NEWS

Leave a Comment