30.3 C
Hyderabad
March 15, 2025 10: 16 AM
Slider గుంటూరు

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రాణాలతో పోలీసు ఆట

galla jaidev

ఆయన ఒక పార్లమెంటు సభ్యుడు. బాధ్యతగల నాయకుడు. అయితేనేం. పోలీసులు ఆయన ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారు. ఎక్కడ ఉన్నాడో తెలియకుండా తిప్పారు. వీళ్లేం పోలీసులో ఇదేం పద్ధతో అర్ధం కావడం లేదు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నుంచి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్​ను మొదట దుగ్గిరాల పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఆ తరువాత కాకాని మిర్చి యార్డుకు తరలించారు.

అనంతరం పేరేచర్ల మీదుగా నరసరావుపేటలోని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్​కు తీసుకువచ్చారు. ఒక చోటు నుంచి తరలించి అందరిని అయోమయానికి గురి చేశారు పోలీసులు. మళ్ళీ రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్ళారు. వెంటనే అక్కడా ఉన్నా 300 మంది టీడీపీ మహిళలు, నాయకులు,కార్యకర్తలు పోలీసు స్టేషన్ ఎదురు నిరసన చేపట్టారు. అప్పటికే గృహ నిర్బంధంలో ఉన్న టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు పోలీస్ స్టేషన్​కు బయల్దేరేందుకు సిద్ధమవ్వగా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు దిగొచ్చిన పోలీసులు అరవిందబాబును వదలిపెట్టడంతో స్టేషన్​కు వెళ్లి జయదేవ్​ను కలిశారు. వెంటనే మాజీమంత్రి పుల్లారావు, అరవిందబాబు పోలీసు ఉన్నత అధికారులుతో మాట్లాడి ఎంపీ గల్లా జయదేవ్ ను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

Related posts

ఈ నెల 13న వస్తున్న హీరో నిఖిల్ ‘కార్తికేయ 2’

Satyam NEWS

అనురాగ్ హెల్పింగ్ సొసైటి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

Satyam NEWS

పార్లమెంట్‌లో ‘అదానీ’ రభస

Murali Krishna

Leave a Comment