40.2 C
Hyderabad
May 1, 2024 15: 08 PM
Slider ప్రత్యేకం

జాతీయ సైన్స్ డే నాడు శార్వాణీ పాఠశాల‌లో విజయనగరం పోలీస్ బాస్

#vijayanagarampolice

విజ‌య‌న‌గ‌రం  పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక కంటోన్మెంట్ లో న‌డుస్తున్న శార్వాణీ పోలీస్ సంక్షేమ ఇంగ్లీషు మీడియం పాఠ‌శాల‌లో జాతీయ సైన్స్ దినోత్స‌వం జ‌రిగింది. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్ధులచే  వైజ్ఙానిక ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. ఈ ప్ర‌దర్శ‌న‌ను జిల్లా ఎస్పీ దీపిక‌, ఓఎస్డీ సూర్య‌చంద్రరావుల‌ను ప‌రిశీలించారు. త‌మ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న పాఠ‌శాల ప‌నితీరు, ఉపాధ్యాయుల ప‌నితీరు…అలాగే విద్యార్ధుల అవ‌గాహ‌న‌ను ఈ సైన్స్ డే సంద‌ర్బంగా పోలీస్ బాస్ క్షుణ్ణంగా ప‌రిశీలించారు.

అలాగే సైన్స్ ప్రాజెక్టుల తయారీలో ఉత్తమంగా నిలిచిన వాటిని ఎంపిక చేసి, వాటిని తయారు చేసిన విద్యార్థులను జిల్లా ఎస్పీ దీపిక‌ అభినందించి, మెడల్స్, మేమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సంద‌ర్బంంగా ఎస్పీ మాట్లాడుతూ…పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ఈ  శార్వాణీ పోలీసు సంక్షేమ పాఠ‌శాల స్థాయిని  పెంపొందిదంచేందుకు ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని ప్రిన్సిప‌ల్ కు సూచించారు.

ఏడోత‌ర‌గ‌తివ‌ర‌కు ఉన్న పాఠ‌శాల‌ల‌ను..టెన్త్ వ‌ర‌కు పెంచేందుకు శాఖ త‌రపున నుంచీ ఓ ప్ర‌య‌త్నం చేద్దామ‌ని ఎస్పీ ఈ సంద‌ర్బంగా అన్నారు. ఇక పాఠ‌శాల‌లోసైన్స్ డే సంద‌ర్బంగా విద్యార్ధులు చేసిన ప‌లుప్ర‌ద‌ర్శ‌న‌లు వారిలో ప్ర‌తిభ‌ను వ్య‌క్త‌ప‌ర‌చ‌డ‌మేనన్నారు.

ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శ్రీ ఎన్.సూర్యచంద్ర రావుతో  పాటు అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ, ఇన్ ఛార్జ్ డిఈఓ బ్రహ్మాజీ రావు, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ఎస్బి సిఐ రాంబాబు, ఆర్ ఐలు శ్రీరామ్, నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ సంధ్య, ఆర్ ఎస్ ఐ నారాయణరావు ఇతర పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

డేంజర్ బెల్స్: కామారెడ్డిని తాకిన కరోన వైరస్

Satyam NEWS

అవమాన భారమే విన్నపం ఒక పోరాటం పునః ప్రారంభించడానికి నాంది

Satyam NEWS

5రోజుల సీబీఐ కస్టడీకి చిదంబరం

Satyam NEWS

Leave a Comment