ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆశ్రమ జునియర్ కళాశాలలో, పాఠశాల లలో సరైన భవనాలు, తరగతి గదులు లేక బాలికలు ఇబ్బందులు పడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ మేరకు ఆమె నేడు ట్రైబల్ వెల్ఫేయిర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ మహేష్ దాత్ ఎక్కా ను కలిసి వినతి పత్రం అందచేశారు.
శిధిలావస్థలో ఉన్న పాఠశాలల, కళాశాల లకు కొత్త భవనాలను నిర్మించాలని ఆమె వినతి పత్రం లో కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని ఆయన సీతక్క కు హామీ ఇచ్చారు.