Slider మహబూబ్ నగర్

ఎలుగుబంటి దాడిలో మరణించిన వ్యక్తికి పరిహారం

forest offecer

ఎలుగుబంటి దాడిలో మరణించిన వ్యక్తికి నేడు ఐదు లక్షల పరిహారం చెల్లించారు. ఈ ఏడాది జూన్ 23న మొలచింతపల్లి గ్రామానికి చెందిన మిరుపల రాముడు పెద్దూట్ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అతని పై ఎలుగుబంటి దాడి చేసింది. దాంతో అతను మరణించాడు. దాంతో అతని కుటుంబానికి ప్రభుత్వం సాయం చేసింది.

రాముడు భార్య నిరంజనమ్మ కు నేడు అటవీ శాఖ అధికారి ఎం. జోజి ఐదు లక్షల రూపాయల చెక్కును అందచేశారు. మొలచింతపల్లిలో ఆయన చెక్కును అందచేసి గ్రామస్తులకు జాగ్రత్తలు చెప్పారు. అనుమతి లేకుండా ఎవరూ అడవిలోకి వెళ్లరాదని అక్కడ వన్య ప్రాణులకు హాని చేయడం గానీ, వాటి నుంచి హాని పొందడం గానీ చేయరాదని జిల్లా అటవీ శాఖ అధికారి జోజి తెలిపారు.

Related posts

నరసరావుపేట నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు

Satyam NEWS

పరవళ్లు తొక్కుతున్న పాపాగ్ని నది

Satyam NEWS

ఎటాక్:వేములవాడలో మరోకరి పై హాత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment