40.2 C
Hyderabad
May 5, 2024 16: 23 PM
Slider జాతీయం

అల్పపీడనంతో చెన్నైని ముంచెత్తుతున్న వర్షాలు

#chennairains

అల్పపీడనం ప్రభావంతో చెన్నై లో భారీ వర్షం కురిసింది. చెన్నై తో పాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్ పట్టు, విల్లుపురం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. పుదుకోట్టై, తిరువారురు,తేన్ కాశీ, తిరు నల్వేలి, కన్యాకుమారి, మధురై, రామనాధపురం, శివ గంగై జిల్లాలకు వర్షం ముప్పు పొంచి ఉంది. చెన్నై నగరంలో మూడు ఎన్. డి. ఆర్.ఎఫ్ బలగాలు మోహరించాయి. భారీ వర్షాలు కారణంగా 12 జిల్లాల్లో నేడు, రేపు స్కూల్స్ కు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కన్యాకుమారి నుంచి చెన్నై మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదే విధంగా భారీ వర్షాలకు కావేరి నది, వైగై,   థెన్- పెన్నై, భవానీ నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. 

Related posts

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘనంగా కళా ఉత్సవ పోటీలు

Satyam NEWS

మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బీజేపీ మహిళా నేత డీకే అరుణ

Satyam NEWS

డాక్టర్ అంబేద్కర్ కు జర్నలిస్టుల ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment