29.7 C
Hyderabad
May 14, 2024 01: 43 AM
Slider మహబూబ్ నగర్

గద్వాల లో నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు

నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాఉత్సవ సమితి ఆధ్వర్యంలో నేడు స్థానిక SV ఈవెంట్ హాల్ లో జరిగిన యువసమ్మేళనం ఘనంగా జరిగింది. వివిధ కళాశాలలకు చెందిన 3500 మంది యవతీయువకులు పాల్గొన్నారు. నైజాం తన ప్రైవేట్ సైన్యం రజాకార్ల ద్వారా తెలంగాణా ప్రాంతంలో చేసిన అరాచకాలను ప్రధాన వక్త కసిరెడ్డివెంకట్ రెడ్డి వివరించారు. నైజాం చేసిన హత్యాకాండనూ ఇక్కడి స్త్రీల పై చేసిన అఘాయిత్యాలను విద్యార్థులకు తెలియజేశారు. చరిత్ర ను మరిచిన వారు చరిత్ర నిర్మాతలు కాలేరని వారు ఈ సందర్భంగా అన్నారు. ఆ తర్వాత ఆరెస్సెస్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ కూర జయదేవ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి అని చెబుతూ ఈ సందర్భంగా నేటి యువత ఉద్దమ్ సింగ్ లాంటి ధైర్య సాహాసాలు కలిగి ఉండాలి అని అన్నారు. లక్ష్యం అంటే భరతమాత సేవలో ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలి పుట్టామా ఏదో బతికామా చనిపోయామా ఇలాంటి నిరర్ధకమైనటువంటి జీవితం గడిపి వ్యర్థం కాబట్టి విద్యార్థులు చరిత్రను సృష్టించేటువంటి లక్ష్యాలను కలిగి ఉండాలని వారు విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నైజాం విముక్త స్వాతంత్ర అమృత్యోత్సవాల ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు ఫణి మోహన్ రావు, అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రాంత సహ సంఘ చాలక్ సుందర్ రెడ్డి, గోపాల్ రావు ఏగ్బోటే, జిల్లా పుల్లరి నాగకృష్ణ, కార్యదర్శి చెంచె ప్రవీణ్, కావలి శీను, ఆంజనేయులు, కరేంద్రనాథ్ వివిధ సంఘ పరివార్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

అందరికి ఉపయుక్తం హెర్బల్ సానిటైజర్ లిక్విడ్

Satyam NEWS

దేశ వైద్య రంగంలో నూతన అధ్యాయాన్ని లిఖించిన తెలంగాణ

Bhavani

ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసుల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్

Murali Krishna

Leave a Comment